High Court: ఘంటా చక్రపాణిని వైస్ చాన్స్‌లర్‌గా ఎలా నియమించారు?

తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే డాక్టర్ చక్రపాణికి కూడా నోటీసులు జారీ చేసింది. అర్హతలు లేకున్నా చక్రపాణిని వీసీగా నియమించారని పేర్కొంటూ హనుమకొండకు చెందిన మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. కుమారస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘చక్రపాణిని వీసీగా నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలి.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగింది. అంతేకాదు, నియామక కమిటీలో సభ్యులు కూడా నిబంధనల ప్రకారం లేరు.
చదవండి: BRAOU VC former TSPSC Chairman: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా మాజీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్
వాస్తవానికి వర్సిటీలో 10 ఏళ్లు ప్రొఫెసర్‌గా, రీసెర్చ్ వింగ్‌లో అనుభవమున్న విద్యావేత్తను వీసీగా నియమించాలి.
చక్రపాణికి 8 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉంది. 2014 నుంచి 2020 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేశారు. 60 ఏళ్ల వయోపరిమితి కూడా దాటిపోయింది. అందుకే ఈ నియామకం చెల్లదు’అని పేర్కొన్నారు.
![]() ![]() |
![]() ![]() |