Scholarships: విదేశీ విద్యాదీవెనకు 357 మంది ఎంపిక
ఈ పథకం ద్వారా ఎస్‌సీ/ఎస్‌టీ/బీసీ/ఈబీసీ /మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి 24 జిల్లాల పరిధిలో 357 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 2022–23 విద్యా సంవత్సరానికి 15 మంది, 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరుగురు వెరసి 21 మంది ఎంపికై నట్లు తెలిపారు. జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిధులు విడుదల చేస్తారన్నారు.
Also read: Govt Jobs: జూనియర్ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..
సహాయ సంక్షేమశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులు, ఎంపికై న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు విరివిగా పాల్గొనేలా చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ నోడల్ అధికారి ఎన్.లక్ష్మానాయక్ తెలిపారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఎస్‌సీ–1, బీసీ–2, ఈబీసీ–12 ఎంపికయ్యారని వీరికి రూ.1,68,13,000 నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్‌టీ 1, బీసీ 2, ఈబీసీకి ముగ్గురు ఎంపికయ్యారని వీరికి రూ.78,71,573. 50 విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 21 మందికి గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.2,46,85,473.50 విడుదల చేస్తారని పేర్కొన్నారు.
Also read: Schools: కొత్తగా 250 మంది ఉర్దూ ఉపాధ్యాయులు
జిల్లాలో ఈ కార్యక్రమం ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాలులో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. అనంతరం జగనన్న విదేశీ విద్యాదీవెన
Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation