Govt Jobs: జూనియర్ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..
- గెస్ట్ లెక్చరర్లకు దరఖాస్తుల ఆహ్వానం
- 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సంబంధిత సబ్జెక్టు పీజీ కోర్సులో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోపు మహబూబియా బాలికల జూనియర్ కాలేజీలో అందజేయాలని సూచించారు. 28న ఉదయం 10 గంటలకు నిర్వహించే వెరిఫికేషన్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.
Also read: AP OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం...చివరి తేదీ ఇదే..
ఖాళీలు ఇక్కడే..
బీహెఈఎల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్, మ్యాథ్య్‌స్, ఫిజిక్స్(2 పోస్టుల చొప్పున), సంస్కృతం, జువాలజీ పోస్టులు, చేవెళ్ల కాలేజీలో బోటనీ, కామర్స్, హిందీ, పొలిటికల్ సైన్స్, ఇబ్రహీంటప్నంలో హిస్టరీ, కందుకూరులో జువాలజీ, కొత్తపేట కాలేజీలో ఇంగ్లిష్, ఫిజిక్స్, జువాలజీ, మాడ్గులలో బోటనీ, కెమిస్ట్రీ, ఎకానమిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, కామర్స్, మహేశ్వరం జూనియర్ కాలేజీల్లో బోటనీ, కామర్స్, హిందీ, మంచాల జూనియర్ కాలేజీలో ఎకానమిక్స్, హిందీ, జువాలజీ, మెగిలిగిద్దలో బోటనీ, ఎకానమిక్స్, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, రాయదుర్గంలో ఎకానమిక్స్, మ్యాథ్స్, జువాలజీ, తెలుగు, రాజేంద్రనగర్‌లో బోటనీ, హిందీ, మ్యాథ్స్, జువాలజీ, సరూర్‌నగర్‌లో ఎకానమిక్స్, బోటనీ, షాద్‌నగర్‌లో మ్యాథ్స్, హిందీ, ఎకానమిక్స్, శంషాబాద్‌లో ఫిజిక్స్, యాచారం జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, ఎకానమిక్స్, మ్యాథ్స్, జువాలజీ సబ్జెక్టుల బోధనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation
ఒకేషనల్ కోర్సుల్లోను 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.