KVS Admissions Notifications 2024 Details : కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు ప్రారంభం... అర్హతలు ఇవే.. ! వీరికే మొదటి ప్రాధాన్యం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు 1254 పాఠశాలల్లో ప్రవేశానికి కొత్త అడ్మిషన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది.
అర్హతలు :
ఏ తరగతిలో ప్రవేశం కోరుచున్నారు అంతకుముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
31 మార్చి 2024 నాటికి ఒకటో తరగతికి 6–8, రెండో తరగతికి 7–9, మూడు, నాలుగో తరగతులకు 8–10 సంవత్సరాల మధ్య, 5,6,7,8,9,10 వ తరగతులకు వరుసగా 9–11, 10–12, 11–13, 12–14, 13–15, 14-16 సంవత్సరాలు కలిగి ఉండాలి.
వీరికి మాత్రమే పరీక్ష :
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలుగా నిర్ణయించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 5న విడుదల చేయనున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
వీరికే మొదటి ప్రాధాన్యం..
☛ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
☛ ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు.
☛ ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీటును కేటాయిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది.
☛ సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
☛ పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
☛ విద్యార్థుల తల్లిదండ్రులు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు
☛ ప్రొవిషనల్ లిస్ట్–1 విడుదల తేదీ : ఏప్రిల్ 19
☛ ప్రొవిషనల్ లిస్ట్–2 విడుదల : ఏప్రిల్ 29
☛ ప్రొవిషనల్ లిస్ట్–3 విడుదల : మే 08
2వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే..
☛ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10 వరకు
☛ ప్రొవిషనల్ లిస్ట్ విడుదల : ఏప్రిల్ 15 నుంచి
☛ అడ్మిషన్లు : ఏప్రిల్ 16 నుంచి 29 వరకు
కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు.
11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు కేటాయించమని కేవీఎస్ స్పష్టం చేసింది.
The minimum and maximum age limit for admission in Kendriya Vidyalayas in various classes is given below: (Child born on 1st April should also be considered.)
Class |
Minimum / Maximum Age as on 31st March of the Year in which admission is sought. |
I |
6 years but less than 08 years of age. |
II |
7 years but less than 09 years of age |
III |
8 years but less than 10 years of age. |
IV |
8 years but less than 10 years of age. |
V |
9 years but less than 11 years of age. |
VI |
10 years but less than 12 years of age. |
VII |
11 years but less than 13 years of age. |
VIII |
12 years but less than 14 years of age. |
IX |
13 years but less than 15 years of age. |
X |
14 years but less than 16 years of age. |
KVS Important Dates 2024-25 :
Events |
Dates |
Class I |
|
Starting date for online registration |
01 April, 2024 |
Last date for online registration |
15 April, 2024 |
Classes II-X (except XI): (subject to availability of vacancies) :
|
|
Starting date for online registration |
01 April, 2024 |
Last date for online registration |
10 April, 2024 |
Declaration of list of class II onwards |
April 15, 2024 |
Admission for class II onward |
April 16, 2024 to April 29, 2024 |
Last Date of admission for all classes except class XI |
June 29, 2024 |
Tags
- kvs 2024 admissions
- KVS Class 1 Admission 2024 Schedule
- KVS Class 2 to 11th class Admissions Dates 2024
- KVS Class 1 Admission 2024 Age limit
- kendriya vidyalaya sangathan
- Kendriya Vidyalaya Sangathan Admission 2024
- admission in Kendriya Vidyalaya Sangathan
- KVS Class 1 admission registration process in telugu
- Kendriya Vidyalaya schools 2024 25 admissions
- KVS Exam Pattern
- KVS Syllabus
- kvs 2024 25 admissions
- Is KVS admission started for Class 1
- What is the age limit for KVS 1st class
- kvs admission 2024 25 for class 1
- kvs admission 2024 25 for class 1 news in telugu
- kvs online admission 2024 25 class 1
- kvs online admission 2024 25 class 1 details in telugu
- KVS
- KendriyaVidyalayas
- sakshieducation
- notifications
- Education
- India
- sakshieducation admissions