Short Video Competitions: ఇంధన భద్రతపై విద్యార్థులకు వీడియో పోటీలు
Sakshi Education
సాక్షి, అమరావతి: జాతీయ ఇంధన భద్రత వారోత్సవాలను పురస్కరిచుకుని విద్యార్థులకు షార్ట్ వీడియో పోటీలు నిర్వహంచను న్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఇంధన సమర్థత ఇధన పరిరక్షణ (ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్) అంశంపై గరిష్టంగా 2 నిమిషాల వీడియోలు రూపొందించి పంపించాలని సూచించారు.
ఏపీ స్టేట్ ఎనర్జీ పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు విద్యార్డులు డిసెంబర్ 5వ తేదీలోగా వీడియోలను పంపించాలని, ఈమేరకు డీఈవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
విజేతలకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమ తిగా రూ.5 వేలు, మరో 10 మంది విజేతలకు ప్రోత్సాహ బహుమతిగా రూ.2 వేల చొప్పున ప్రదానం చేస్తారని తెలిపారు. వీడియోలను ఆయా పాఠశాల యాజమాన్యం ద్వారా https://forms.gle/g1PcAtYicfkm8VrT6
లింకు పంపించాలని సూచించారు.
Published date : 23 Nov 2024 10:52AM