Schools: కొత్తగా 250 మంది ఉర్దూ ఉపాధ్యాయులు
Sakshi Education
కదిరి అర్బన్: పాఠశాలలో ఉర్దూ టీచర్ల కొరతను అధిగమించేందుకు నూతనంగా 250 మంది ఉర్దూ ఉపాధ్యాయులను నియమిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
స్థానిక మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న భాషా నైపుణ్య శిక్షణ తరగతులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ఇంగ్లిష్‌పై విద్యార్థులు పట్టు సాధించేలా విద్యాబోధన సాగాలన్నారు. ఇంగ్లిష్ ప్రాధాన్యతపై విద్యార్థులను చైతన్య పరచాలన్నారు. సమగ్ర శిక్ష మైనార్టీ కో ఆర్డినేటర్ అబ్దుల్, ఇన్‌చార్జ్ సీఏంఓ అబ్దుల్ మాలిక్, మండల విద్యాధికారి చెన్నకృష్ణ పాల్గొన్నారు.
Also read: Govt Jobs: జూనియర్ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..
Published date : 26 Jul 2023 03:02PM