Skip to main content

All Schools and Colleges Holidays Due to Heavy Rain 2024 : అతి భారీ వ‌ర్షాలు.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ! మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించించిన విష‌యం తెల్సిందే. రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఏపీలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.
All Schools and Colleges Closed Due to Heavy Rain 2024  Heavy rain forecast for Telangana and Andhra Pradesh  Meteorological Department weather alert  Low pressure system over Bay of Bengal causing heavy rain

ఇవాళ (సోమవారం) కరీంనగర్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

☛ July Month Holidays 2024 : జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే సెల‌వులు ఇవే..!

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జూలై 18, 19వ తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.

schools and colleges holiday due to rain telugu news

ఇప్ప‌టికే IMD హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. గోవా,  కర్నాట‌క‌, కేర‌ళ‌లోని అన్ని స్కూల్స్‌,  కాలేజీల‌కు సెల‌వులను ప్ర‌క‌టించారు. దాదాపు ఈ రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ఇచ్చారు. అలాగే రానున్న ఐదు రోజులు తెలంగాణ‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సెల‌వుల‌పై విద్యాశాఖ ఎటువంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు. అయితే జూలై 17వ తేదీన (బుధ‌వారం) మొహర్రం పండ‌గ సంద‌ర్భంగా అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చారు.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 15 Jul 2024 05:05PM

Tags

Photo Stories