Skip to main content

New Syllabus in Higher Education: ఉన్నత విద్యలో త్వరలో కొత్త సిలబస్‌.. కొత్త సిలబస్‌ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో అతి త్వరలో కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలంగాణ‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు.
New Syllabus in Higher Education  New syllabus announcement for higher education in Telangana

ఇది విద్యను మరింత బలోపేతం చేస్తుందని ఆ యన స్పష్టం చేశారు. మార్కెట్‌ డిమాండ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ పాఠ్యాంశాలను సవరించడానికి, అమలు చేయడానికి మండలి నేతృత్వంలో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్లు, కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.

చదవండి: Engineering Syllabus Changes : ఇంజినీరింగ్‌ సిలబస్‌లో చేయ‌నున్న‌ మార్పులు ఇవే...! ఇంకా..

ఈ కమిటీ ఇప్పటికే నిపుణులతో కలసి కొత్త సిలబస్‌ను రూపొందించింది. దీనిపై తాజాగా అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో ఉన్నట్టు బాలకిష్టారెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. కొత్త సిలబస్‌లో టెక్నాలజీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సంబంధించిన ఇంటిగ్రేషన్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, పరిశోధన, అభివృద్ధి, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు.  

చదవండి: New Courses in Degree : డిగ్రీలో త్వ‌ర‌లోనే కొత్త కోర్సు ప్ర‌వేశం.. ఇందులోకూడా మార్పులు..!!

ఇంటర్న్‌షిప్‌ల కల్పన:

యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు అకడమిక్‌ లెర్నింగ్, వాస్తవ ప్రపంచ సవాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఇంటర్న్‌షిప్‌లు కల్పించాలని మండలి నిర్ణయించినట్టు బాలకిష్టారెడ్డి తెలిపారు. దీని ద్వారా విధాన నిర్ణయాలు, గవర్నెన్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో అనుభవాన్ని అందిస్తామన్నారు.  

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Jan 2025 03:28PM

Photo Stories