Skip to main content

July Month Holidays 2024 : జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే సెల‌వులు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : 2024 జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే పండుగ సెల‌వులతో.. పాటు ఇత‌ర సెల‌వులు త‌క్కువ‌గానే ఉన్నాయి. జూలై నెల‌లో జూలై 7, 14, 21, 28 తేదీల్లో వ‌చ్చే ఆదివారం సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు సెల‌వులు ఉన్న విష‌యం తెల్సిందే.
July Month Schools and Colleges Holidays 2024    Holiday schedule for July 2024

అలాగే  13, 27వ తేదీల్లో రెండో శ‌నివారం, నాల్గో శ‌నివారం సాధార‌ణంగా చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఇస్తున్న విష‌యం తెల్సిందే. అలాగే అనుకోని బంద్‌లు, భారీ వర్షాలు వ‌స్తే.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. మొత్తం మీద ఈ నెల‌లో దాదాపు 8 రోజులు వ‌ర‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. జూలై 17వ తేదీన (బుధ‌వారం) మొహర్రం పండ‌గ సంద‌ర్భంగా అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చారు.

ఇదే నెల‌లో పెద్ద పండగ బోనాలు.. వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వులు..

telangana bonalu festival 2024

అలాగే ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ పెద్ద పండుగ బోనాలు. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ రోజున సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవుదినం ఉంది. అలాగే మ‌ళ్లీ రోజు జూలై 28వ తేదీన ఆదివారం. దీంతో వ‌రుస‌గా జూలై 27, 28వ తేదీల్లో సెల‌వులు రానున్నాయి.

జూలై 7వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు తెలంగాణలో బోనాలు.  ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్​ లో బోనాల హడావిడి  ప్రారంభమవుతుంది. ఓ పక్క అమ్మవారి భక్తులు.. మరో పక్క రాజకీయ నేతల హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణలో బోనాల పండుగకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జంట నగరాలైన హైదరాబాద్​, సికింద్రాబాద్​ లలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మహంకాళీ అమ్మవారి బోనాలు ఈ వేడుకలో ప్రధానమైనది.  ఆరోజున హైదరాబాద్​ అంతటా కోలాహలంగా ఉంటుంది. 

జూలై 3వ తేదీన‌..
కేరళలో.. ఎంతో ప్రాచీనమైన బోట్​ రేస్​ . అలప్పుజకు సమీపంలోని చంపాకుళం వద్ద పంపా నదీ తీరంలో ఈ రేస్​ ప్రారంభమవుతుంది. జులైలో వర్షాల కాలంలో నదులు, జలాశయాల్లో భారీగా నీరు చేరి నిల్వ ఉంటుంది.  పంటలు బాగా పండాలని  నదీమతల్లులకు పూజలు జరిపి  కేరళలో నిర్వహించే రేసులలో ఇది మొదటిది. 

జూలై 5వ తేదీన‌.. అరుణాచల్​ ప్రదేశ్​లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జులై 5న అపాటాని తెగ ప్రజలు ..  రైతు పండుగను జరుపుకుంటారు. ఆ తెగ ఆచారాల ప్రకారం వారి కుల దేవతలైన  తమూ, మేటిస్, డానీ,  హర్నియాంగ్ దేవతలను పూజిస్తారు. ఈ పండుగ రోజు బియ్యంతో పొంగలి ప్రసాదం చేసి అమ్మవార్లకు నివేదన సమర్పించి.. ఇరుగు పొరుగువారికి పంచి పెడతారు. అలాగే ఇంట్లోని పెద్దలకు, తోబుట్టువులకు, అత్త మామలకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు బట్టలు పెట్టి ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. 

పూరీ జగన్నాథ రథయాత్ర సంద‌ర్భంగా..
జూలై 7వ తేదీన‌ పూరీ జగన్నాథ రథయాత్ర. ఒరిస్సాతో పాటు దేశవ్యాప్తంగా ఈ పండుగ సంబరాలు జరుపుకుంటారు. అత్యంత గౌరవనీయమైన వేడుకలలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ఒరియా క్యాలెండర్‌ ప్రకారం శుక్ల పక్ష ఆషాఢ మాసం రెండవ రోజున జరుపుకుంటారు. దీనిని గుండిచా యాత్ర, రథోత్సవం, నవాదిన యాత్ర అని కూడా అంటారు. ఆ తర్వాత తొమ్మిదవ రోజున, దేవతలు .. రథయాత్ర ద్వారా  ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర సమయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. 

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

 

2024 జులై నెల బ్యాంక్ హాలీడేస్ లిస్ట్..

☛ జులై 3వ తేదీ : షిల్లాంగ్, మేఘాలయా వంటి ప్రాంతాల్లో బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

☛ జులై 6వ తేదీ : ఎంహెచ్ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్ ప్రాంతంలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

☛  జులై 7వ తేదీ : ఈ రోజు ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.

☛ జులై 8వ తేదీ : మణిపూర్ రాష్ట్రంలో కాంగ్ (రథ యాత్ర) సందర్భంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి.

☛ జులై 9వ తేదీ : సిక్కిం రాష్ట్రంలో ద్రుప్‌కా షిజి సందర్భంగా అక్కడ బ్యాంకులకు సెలవు ఉంటుంది.

☛ జులై 13వ తేదీ : రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు అన్నింటికి సాధారణ సెలవు ఉంటుంది.

☛ జులై 14వ తేదీ : ఆదివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు మూసి ఉంటాయి.

☛ జులై 16వ తేదీ : హరేలా సందర్భంగా డెహ్రాడూన్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

☛ జులై 17వ తేదీ : మొహర్ర, అషూరా, యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ, జైపూర్, కోల్‌కతా, కాన్పూర్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, రాంచీ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

☛ జులై 21వ తేదీ : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారాణ వారాంతపు సెలవు ఉంటుంది.

☛ జులై 27వ తేదీ : నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు అన్నింటికీ సాధారణ సెలవు ఉంటుంది.

☛ జులై 28వ తేదీ : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి.

Published date : 29 Jun 2024 08:16AM

Photo Stories