Skip to main content

Minister Seethakka: విద్యకు మొదటి ప్రాధాన్యం.. తాను ఇక్క‌డ‌ ఉండి చదుకువున్నా..

చైతన్యపురి: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని మంత్రి సీతక్క అన్నారు.
Minister Seethakka

జ‌న‌వ‌రి 16న‌ కొత్తపేటలోని సరూర్‌నగర్‌ సంక్షేమ గురుకులాల కళాశాలలో సంక్షేమ గురుకుల విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గురుకులాల్లో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పండిట్‌ జవహర్‌ లాల్‌ చెప్పేవారని గుర్తు చేశారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్‌ నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్‌ టీచర్లు, ప్రిన్సిపాల్స్‌ చేతుల్లో ఉంటుందన్నారు.

చదవండి: Courses Prohibition : 3 యూనివ‌ర్సిటీల్లో 5 ఏళ్లపాటు ఈ కోర్సులు నిషేధం.. కార‌ణం..!

టీచర్లు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. తాను హాస్టల్‌లో ఉండి చదుకువున్నానని, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ చేసి ఇప్పుడు మరో పీజీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హాస్టల్‌ జీవితం ఆనందదాయకంగా ఉండాలని, అందించే ఆహారం సొంత కుటుంబాన్ని గుర్తు చేసుకునేలా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు.

Published date : 18 Jan 2025 11:26AM

Photo Stories