Pure Charity: గురుకుల విద్యార్థులకు సాంకేతిక, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు

గురుకుల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, సమగ్ర అభివృద్ధి తదితర కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ప్యూర్ సంస్థ బీసీ గురుకుల సొసైటీలో వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధానంగా టెక్నాలజీ, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అందించడంతో పాటు డిజిటల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్ట నుంది.
చదవండి: Minister Seethakka: విద్యకు మొదటి ప్రాధాన్యం.. తాను ఇక్కడ ఉండి చదుకువున్నా..
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు బృంద చైతన్యం, సామాజిక సేవను పెంచేలా ప్రత్యేకంగా యువజన క్లబ్‌లను ప్యూర్ సంస్థ ఏర్పాటు చేయ నుంది. ఈమేరకు జనవరి 17న బీసీ గురుకుల సొసైటీతో ప్యూ ర్ సంస్థ అవగాహన కుదుర్చుకుంది.
![]() ![]() |
![]() ![]() |
సొసైటీ కార్యదర్శి బి.సైదులు, ప్యూర్ సంస్థ సీఈఓ శైలా తల్లూరి ఎంఓయూపైన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లా డుతూ ప్యూర్ భాగస్వామ్యంతో విద్యార్థులకు ఉన్నత విద్యా కార్యక్రమాలను అందించే అవకాశాలు పెరుగుతాయని, ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాన్ని అందిస్తామన్నారు.