Skip to main content

July 17th Holiday 2024 : జూలై 17వ తేదీన‌ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : జూలై నెల స్కూల్స్‌, కాలేజీల‌కు పండ‌గల‌ రూపంలో రెండు రోజులు సెల‌వులు రానున్నాయి. 2024 జూలై 17వ తేదీన (బుధ‌వారం) స్కూల్స్‌, కాలేజీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెల‌వు ఇవ్వనున్నారు.
Telangana and Andhra Pradesh school and college holiday on July 17   July 17th Schools and Colleges Holiday  State holiday in Telangana on July 27, 2024 for Bonalu festival.

ఇప్ప‌టికే అకడమిక్ క్యాలెండర్ ప్ర‌కారం విద్యా శాఖ జూలై 17వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆఫీసుల‌కు కూడా ఆ రోజున‌ సెలవు ఇవ్వ‌నున్నారు. ఎందుకంటే.. జూలై 17వ తేదీన బుధ‌వారం మొహరం పండ‌గ‌. క‌నుక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు ఆ రోజు సెల‌వు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు..
ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఈ పండ‌గ‌ను పీర్ల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు.

☛ July Month Holidays 2024 : జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే సెల‌వులు ఇవే..!

మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్ని గుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా.. అదే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. 

కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు తమ రక్తంతో శోక తప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు. మహ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. 

అలాగే జూలై 27వ తేదీన కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు..
ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీలకు జూలై 27వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించింది తెలంగాణ‌ ప్ర‌భుత్వం. తెలంగాణ పెద్ద పండగ‌ల‌లో బోనాలు ఒక‌టి. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ రోజున సెలవు ప్రకటించారు. 

వ‌రుస‌గా రెండు రోజులు పాటు..
అలాగే తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవుదినం ఉంది. అలాగే మ‌ళ్లీ రోజు జూలై 28వ తేదీన ఆదివారం. దీంతో వ‌రుస‌గా జూలై 27, 28వ తేదీల్లో సెల‌వులు రానున్నాయి.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇలా..

☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 01 Jul 2024 09:22AM

Tags

Photo Stories