Skip to main content

Skill Training Centre: శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు

హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని కేడీసీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఎంఎస్‌ ఆఫీస్‌, బ్యూటీషియన్‌, మొబైల్‌ సర్వీసింగ్‌, రిఫ్రిజిరేషన్‌, ఏసీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెంట్‌ మేకింగ్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఆగ‌స్టు 23న‌ పరీక్షలు నిర్వహించారు.
Examinations for trained candidates

హైదరాబాద్‌ సెట్విన్‌ నుంచి నాగేశ్వర్‌రావు హాజరై పరీక్షలను పర్యవేక్షించారు. నిరుద్యోగులు వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శిక్షణ పొందిన 51మందికి గాను 49 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీవైఎస్‌ఓ అశోక్‌ తెలిపారు. పరీక్ష పర్యవేక్షణలో వై.విజయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: Free computer Training: బేసిక్‌ కంప్యూటర్స్‌లో ఉచిత శిక్షణ.. కావల్సిన అర్హతలు ఇవే

Published date : 24 Aug 2024 02:12PM

Photo Stories