Employment Opportunity: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు..
![Employment opportunity with free training under skill development institute](/sites/default/files/images/2024/05/30/free-training-job-offer-1717054935.jpg)
శ్రీకాకుళం: హెచ్‌పీఎల్‌సీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెపలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో బొల్లినేని మెడిస్కిల్స్ తరఫున బ్యూటీషియన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ సెంటర్ హెడ్ సీహెచ్ నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులను విశా ఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సెకెండ్ ఫ్లోర్‌లో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులకు గాను పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 28 సంవత్సరాల్లోపు ఉన్న యువతీ యువకులు అర్హులన్నారు. మూడు నెలలు శిక్షణ కాలంలో యూనిఫారంతో పాటు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు వారు తెలిపారు. వివరాలకు రాగోలు జెమ్స్ ఆస్ప త్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్ లేదా 76809 45357, 9121999654 నంబర్లను సంప్రదించాలన్నారు.