Skip to main content

PG Medical Students : పీజీ వైద్య విద్యార్థుల‌కు ఎన్ఎంసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఈ విష‌యంలో అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి..

వైద్య విద్య కోర్సులో పీజీ చేస్తున్న విద్యార్థుల‌కు ఒక వార్త అందించింది జాతీయ వైద్య క‌మిష‌న్‌.
National medical council notification for pg medical students

సాక్షి ఎడ్యుకేష‌న్: వైద్య విద్య కోర్సులో పీజీ చేస్తున్న విద్యార్థుల‌కు ఒక వార్త అందించింది జాతీయ వైద్య క‌మిష‌న్‌. డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్‌పీ)లో భాగంగా విద్యార్థులు కనీసం 3నెలల పాటు జిల్లా ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఈ మెర‌కు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఇక‌, విద్యార్థులు కూడా వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా వెళ్లే వీలు క‌ల్పిస్తుంది ఎన్ఎంసీ. అంతేకాదు, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో పీజీ విద్యార్థులు ఆయా ఆసుపత్రుల్లో పనిచేయవచ్చని తెలిపింది.

Education News: ఆంధ్ర ప్రదేశ్ పీజీ వైద్య విద్యార్థులపై.. ఫీజుల భారం

వివిధ విభాగాల్లో పాల్గొని..

నాన్-క్లినికల్ స్పెషాలిటీలలోని పీజీ విద్యార్థులకు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో శిక్షణ ఇస్తారని ఎన్ఎంసీ పేర్కొంది. డయాగ్నస్టిక్స్, ప్రయోగశాల సేవలు, ఫార్మసీ, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ క్లినికల్ విధులు, నిర్వాహక బాధ్యతలు, ప్రజారోగ్య కార్యక్రమాల్లో వీళ్లు పాల్గొనవచ్చు. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇతర జాతీయ పరిశోధనా సంస్థల పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలు లేదా ఫీల్డ్ సైట్లలో కూడా పీజీ విద్యార్ధులను నియమిస్తారు.

Good News for PG Medical Students: తెలంగాణలో MBBS చేస్తే.. పీజీలో ‘స్థానికులే’.. ఇతర రాష్ట్రాల్లో మెడిసిన్ ​చదివిన వారు మాత్రం ఇలా..

ఈ ఉత్త‌ర్వుల్లో భాగంగా.. అంతర్రాష్ట్ర పోస్టింగ్‌ల విష‌యంలో విద్యార్థుల అభ్య‌ర్థ‌న‌లు చాలా అరుదుగా ఉండాలన్నారు. అంతేకాకుండా, అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ప‌రిగ‌ణిస్తామ‌ని ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు క‌మిష‌న్‌. ఏదైనా రాష్ట్రం ఇక‌, ఈ విష‌యంపై ఇలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్నా ఎన్ఎంసీ పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (పీజీఎమ్ఈబీ) నుంచి ముంద‌స్తు అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఆ త‌రువాతే త‌దుప‌రి నిర్ణ‌యాలు తీసుకుని ప్ర‌క‌టించ‌వచ్చ‌ని పేర్కొంది బృందం.

ఇక‌, వివిధ ఆస్ప‌త్రుల్లో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో పీజీ వైద్య విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంద స్పష్టం చేసింది ఎన్ఎంసీ.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Feb 2025 09:23AM

Photo Stories