CBSE 10th and Inter Board Exams Rules : సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం.. పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: ఫిబ్రవరి 15వ తేదీ.. అంటే, శనివారం నుంచి సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మెరకు విద్యార్థులు ఫాలో కావాల్సిన పలు నియమ నిబంధనల గురించి బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్పిల్ 4వ తేదీ వరకు 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరుగుతాయి.
సీబీఎస్ఈ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, విద్యార్థుల పరీక్ష ప్రతీ రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. కొన్ని సబ్జెక్టు పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకే ఉంటుంది. ప్రతీ పరీక్షకు విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల సమయంలో తప్పకుండా పాటించాల్సిన పలు నియమ నిబంధనలు..
1. డ్రెస్ కోడ్: రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాల సూచించిన యూనిఫాంలో పరీక్షకు హాజరు కావాలి. అదేవిధంగా, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు లేత లేదా ముదురు రంగు దుస్తులు ధరించాలి.
2. వెంట తెచ్చుకోవాల్సిన వస్తువులు: హాల్‌టికెట్, స్టూడెంట్ ఐడీ కార్డు, పెన్, స్కేల్.. స్టేషనరీ వస్తువులు. ప్రైవేట్ విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలి. సాధారణ గడియారాలు మాత్రమే అనుమతిస్తారు. పారదర్శక నీటి బాటిల్, మెట్రో కార్డ్/బస్ పాస్, అవసరమైన డబ్బు.
3. అనుమతిలేని వస్తువులు: పుస్తకాలు, గమనికలు, వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే.. మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ పెన్ను వంటివి. కాలిక్యులేటర్ (ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మాత్రమే అనుమతి) దీనికి ఇన్విజిలేటర్ల నుంచి అనుమతి తీసుకోవాలి. వాలెట్, హ్యాండ్‌బ్యాగ్, పౌచ్, మొదలైనవి.
4. ఇవి తప్పనిసరి:
- విద్యార్థులు పరీక్షకు ముందే ఒకసారి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. దీంతో, పరీక్ష రోజు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.
- విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు ఉందన్న విషయాన్ని గమనించాలి. ప్రతీ విద్యార్థిపై అధికారుల నిఘా ఉంటుంది.
- పరీక్ష రాసే సమయంలో, విద్యార్థి తమ ప్రశ్నా పత్రాలపై ఎలాంటి రాత రాయకూడదు. కేవలం వారి హాల్‌టికెట్ నంబర్ ఉండాలి. ఎలాంటి రాత ఉన్న అక్కడి ఇన్విజిలేటర్ వారిపై తప్పనిసరి చర్యలు తీసుకుంటారు.
- విద్యార్థులకు పరీక్ష రాసే సమయంలో ఎలాంటి సందేహాలున్నా.. అక్కడి ఇన్విజిలేటర్‌ను అడిగి తెలుసుకోవాలి.
- విద్యార్థి ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- cbse board exams
- board exams 2025
- CBSE Syllabus
- board exams for tenth and inter
- february 15th
- board exams for cbse students
- 10th and inter board exams 2025
- rules and regulations for cbse board exams
- 10th and 12th board exams for cbse students
- exam centers for cbse students
- timings and schedule
- timings and schedule for cbse 10th and 12th classes
- 10th Class Board Exams 2025
- strict rules for cbse board
- dress code for cbse 10th and 12th board 2025
- Education News
- Sakshi Education News
- Exam Guidelines