Skip to main content

10th Board Exam 2025 Rules : ఫిబ్ర‌వ‌రి 15 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు.. కేంద్రానికి అనుమ‌తి, నిషేదం ఇవే..

వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో 15వ తేదీ నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025లో క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.
Rules and regulations for cbse tenth board exam 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో 15వ తేదీ నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025లో క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, పాటించాల్సిన నిబంధ‌న‌లు వంటి విష‌యాల‌ను బోర్డు వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టించింది. మొత్తం 44 లక్షల మంది విద్యార్థులు 204 వేర్వేరు సబ్జెక్టులలో కేటాయించిన వివిధ ప‌రీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో సెంట్ర‌ల్ బోర్డు విడుద‌ల చేసిన కొన్ని నిబంధ‌న‌లు, అనుమ‌తి క‌లిగిన‌వి అంశాల‌ను తెలుసుకుందాం..

CBSE Schools Must Have These Details: స్కూళ్లకు సీబీఎస్‌ఈ చివరి అవకాశం.. 30 రోజుల్లోగా అప్‌లోడ్‌ చేయాలని ఆదేశం

ప‌రీక్ష కేంద్రానికి నిషేదం:

1. టెక్స్టు మెటీరియల్స్ (ప్రింట్ చేసిన లేదా రాతపూర్వకంగా), కాగితాల ముక్కలు, క్యాల్క్యులేటర్ (లెర్నింగ్ డిసేబిలిటీ ఉన్న విద్యార్థులు, ఉదాహరణకు డిస్క్యాల్క్యులియా ఉంటే క్యాల్క్యులేటర్‌ను అనుమ‌తించేందుకు కేంద్రం వ‌ద్ద ముందే అనుమతి తీసుకోవాలి, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్/స్కానర్, ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి అనుమతి లేదు.

2. మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఎయిర్‌ఫోన్లు, పెజర్, హెల్త్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లు, , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమ‌తి లేదు.

3. ప‌రీక్ష కేంద్రంలోకి ఆహార ప‌దార్ధాలు కూడా అనుమ‌తించ‌రు. అనారోగ్యం క‌లిగిన‌వారైతే కేంద్రం వ‌ద్ద అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

CBSE vs State Board: సీబీఎస్‌ఈ వర్సెస్‌ స్టేట్‌ బోర్డ్‌.. ఏది బెటర్‌!.. తెలుసుకోండి..

4.విద్యార్థులు షూ వేసుకునేందుకు అనుమ‌తి లేదు.

ప‌రీక్ష కేంద్రానికి త‌ప్ప‌నిస‌రి:

1. ప‌రీక్ష‌కు సంబంధించిన‌ అడ్మిట్ కార్డ్, స్కూల్ ఐడెంటిటీ కార్డ్ త‌ప్ప‌నిస‌రి.

2. అడ్మిట్ కార్డ్, ప్రభుత్వ ఇష్యూను ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ (ప్రైవేట్ విద్యార్థుల కోసం).

3. స్టేషనరీ వస్తువులు.. ట్రాన్స్పరెంట్ పౌచ్, జియోమెట్రీ/పెన్సిల్ బాక్స్, బ్లూ/రాయల్ బ్లూ ఇంక్/బాల్ పాయింట్/జెల్ పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరేజర్ వంటి వ‌స్తువులు ఎవ‌రివి వారే తీసుకురావాలి.

OU PhD Admissions: ఓయూ పీహెచ్‌డీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ వాయిదా.. కార‌ణం ఇదే!

4. అనలాగ్ వాచ్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, మెట్రో కార్డ్‌, బ‌స్ పాస్‌, డ‌బ్బులు ఇవి మాత్రం క్లాస్ రూమ్‌లోకి అనుమ‌తి ఉండ‌దు.

5. రెగ్యులర్ విద్యార్థుల కోసం: స్కూల్ యూనిఫారం
    ప్రైవేట్ విద్యార్థుల కోసం: సన్నని బట్టలు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Jan 2025 05:10PM

Photo Stories