CBSE Schools Must Have These Details: స్కూళ్లకు సీబీఎస్‌ఈ చివరి అవకాశం.. 30 రోజుల్లోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశం
Sakshi Education
సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు అన్నింటికి ప్రత్యేక వెబ్‌సైట్ ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తేల్చిచెప్పింది. ప్రతి స్కూల్ తమకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసుకోవాలని, అందులో టీచర్ల విద్యార్హతలు, సంబంధిత డాక్యుమెంట్లు సహా ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
గతంలో 2021లోనే ఇందుకు సంబంధించి సీబీఎస్‌ఈ సర్క్యులర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా చాలా వరకు స్కూళ్లకు ప్రత్యేక వెబ్‌సైట్ లేదు. దీనిపై పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎలాంటి మార్పు లేదు. దీంతో స్కూళ్లకు ఇదే చివరి ఛాన్స్ అని సీబీఎస్‌ఈ హెచ్చరించింది.
Goodnews For Students To Clear Backlog Subjects: బ్యాక్‌లాగ్ సబ్జెక్టులున్నాయా? అలాంటి వారికి గుడ్‌న్యూస్...
అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలు కశ్చితంగా వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలని, అందులో నిర్ణీత వివరాలన్నింటిని నమోదు చేయాలని స్పష్టం చేసింది. సర్క్యులర్లను పరిశీలించి డాక్యుమెంట్లను 30 రోజుల్లోగా అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని, ఈ ఆదేశాలు పాటించని స్కూళ్లపై బోర్డు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా సైతం విధిస్తుందని పేర్కొంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 10 Jan 2025 03:57PM
Tags
- Central Board of Secondary Education
- CBSE
- The Central Board of Secondary Education
- CBSE - Central Board of Secondary Education
- Central Board of Secondary Education latest updates
- Central Board of Secondary Education News
- CBSE Schools
- CBSE Schools Breaking News
- CBSE schools important update
- websites
- teachers qualification
- central board
- cbse circular