CBSE Responds On Syllabus Reduction: పరీక్షల్లో 15 శాతం సిలబస్‌ను తగ్గించారా? సీబీఎస్ కీలక ప్రకటన
అంతేకాకుండా ఎంపిక చేసిన కొన్ని సబ్జెక్ట్స్‌లో ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించనుందన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తెలిపింది. బోర్డ్ నుంచి అధికారికంగా వచ్చే ప్రకటనల్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను నమ్మొద్దని తేల్చిచెప్పింది.
Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
కాగా విద్యార్థులపై విద్యాభారాన్ని తగ్గించేందుకు సీబీఎస్ఈ.. 10, 12వ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను 10-15 శాతం తగ్గిస్తున్నట్లు, ఈ మేరకు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. దీంతో కొన్ని వార్తాపత్రికల్లో, వెబ్‌సైట్స్‌లోనూ ఈ విషయాన్ని హైలైట్ చేశారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని సీబీఎస్‌ఈ వివరించడంతో ఇదంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
Walk-in Interview: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా..నెలకు రూ.35వేలు జీతం
త్వరలోనే జరగనున్న బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని, పాత పద్ధతిలోనే పరీక్షలు కొనసాగుతాయని సీబీఎస్‌ఈ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా కోరింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)