Skip to main content

CBSE New Syllabus 2024 : వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌పై శిక్షణ...

CBSE New Syllabus 2024 : వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌పై శిక్షణ...
 వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌పై శిక్షణ...
CBSE New Syllabus 2024 : వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌పై శిక్షణ...

గుంటూరు : వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న పదో తరగతి నూతన పాఠ్యాంశాలపై ఈనెల 19న నిర్వహిస్తున్న ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో లాంలోని చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఓరియెంటేషన్‌కు సంబంధించిన పోస్టర్లను గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు.

Also Read:  Girls Gurukul Admissions

ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఫిజికల్‌ సైన్స్‌, బయాలాజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌తో పాటు ఇంగ్లిషు సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలపై నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. పేర్లు నమోదు చేసుకునేందుకు 99480 15701 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు టీఆర్‌ రమేష్‌, బి.ప్రసాద్‌, జి. వెంకటరావు, టీఆర్‌ చాందిని, జీవీవీ సుబ్బారాయుడు, బి.ఉదయభాస్కర్‌, బి.శంకర్‌సింగ్‌, ఎం.ఉదయభాస్కర్‌, ఎస్‌ఎం సుభానీ, ఇ.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Published date : 17 May 2024 11:16AM

Photo Stories