Skip to main content

Girls Gurukul Admissions: బాలిక‌ల గురుకులంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

నూత‌న విద్యా సంవ‌త్సరానికి గురుకుంలో ప్ర‌వేశం పొందేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు గురుకుల పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ వెంక‌టేశ్వ‌ర్లు..
Last date for applications for admissions at girls gurukul schools

గూడూరు: గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవ్యానగర్‌లో ఉన్న ఏటీడబ్ల్యూఆర్‌ (బాలికల) గురుకులంలో 2024–25 విద్యా బాలిక‌ల గురుకులంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ పే.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో 40, 4వ తరగతిలో 35, 5వ తరగతిలో 30, 6వ తరగతిలో 7, 7వ తరగతిలో 3 సీట్లు వంతున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 3వ తరగతిలో గల 40 సీట్లలో ఎస్టీకి 31, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1, ఏఈక్యూ 1 చొప్పున భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.

Summer Camp: విద్యార్థుల ప్ర‌తిభ‌కు అభినంద‌న‌లు..!

మిగిలిన తరగతుల్లో మిగిలిన ఖాళీలను కేవలం ఎస్టీ విద్యార్థినులచే మాత్రమే భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు గురుకుల పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా ప్రధానాచార్యుల కార్యాలయంలో ఈనెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఖాళీలకు మించి దరఖాస్తులు వస్తే వాటిని ఐటీడీఏ పీడీ(యానాదులు) నెల్లూరులోని కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి సీట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 8333925187, 8885372878, 9441596331 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

SBI Youth Fellowship 2024 : రూ.15000 స్టైఫండ్‌తో ఫెలోషిప్.. అర్హ‌త‌లు ఇవే..

Published date : 17 May 2024 10:56AM

Photo Stories