Skip to main content

Summer Camp: విద్యార్థుల ప్ర‌తిభ‌కు అభినంద‌న‌లు..!

వేస‌వి శిక్ష‌ణ శిబిరంలో విద్యార్థుల‌కు నేర్పిస్తున్న శిక్ష‌ణ‌ను ప‌రిశీలించేందుకు డీఈఓ ఆకస్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. అందులో ఆయ‌న మాట్లాడుతూ..
DEO Devaraju appreciates students talent in summer camp inspection

చిత్తూరు: వేసవి శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు గీసిన చిత్రలేఖనం బొమ్మలు చాలా బాగున్నాయని డీఈఓ దేవరాజు అభినందించారు. జిల్లా కేంద్రంలోని తపోవనం సంస్కృతోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బాపు బాలభవన్‌ చిత్రలేఖనం వేసవి శిక్షణా శిబిరాన్ని గురువారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Semester Instant Exams: డిగ్రీలో తప్పిన విద్యార్థులకు ఇన్‌స్టంట్‌ ఎగ్జామ్స్‌.. ఫీజు వివరాలు ఇవే

అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు శిబిరంలో శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేసవి శిక్షణా శిబిరం శిక్షకులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

SBI Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌.. SBIలో 15000 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Published date : 17 May 2024 10:37AM

Photo Stories