Skip to main content

SBI Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌.. SBIలో 15000 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఐటీ, ఇతర విభాగాల్లో సుమారు 15000 ఉద్యోగాలు నియమించుకోన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖలతోపాటు 15 వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు.
SBI Jobs

వీరిలో అత్యధిక మంది మార్కెటింగ్‌ విభాగానికి చెందినవారని.., అలాగే 11-12 వేల మంది ప్రోబేషనరీ ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగులను సైతం రిక్రూట్‌ చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగులతోపాటు ఇంజినీర్లు కూడా ఉన్నారన్నారు. 

☛ SBI Youth Fellowship 2024 : రూ.15000 స్టైఫండ్‌తో ఫెలోషిప్.. అర్హ‌త‌లు ఇవే..

ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి..

SBI Bank చైర్మన్‌ దినేశ్‌ ఖారా

ఇంకా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులను ఎంపిక చేసి కామన్ స్టాఫ్, అసోసియేట్ స్టాఫ్‌గా దాదాపు 85 శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను తయారు చేయబోతున్నామని స్పష్టం చేశారు. అందరికీ బ్యాంకింగ్‌ను అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ ఇస్తామని కూడా తెలిపారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2,32,296కి పడిపోయిందని పేర్కొన్నారు. టెక్నికల్ స్కిల్స్ కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు.

☛ UPSC NDA & NA -II Notification 2024 : ఇంట‌ర్ అర్హ‌త‌తోనే.. 404 ఉన్నతస్థాయి ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలకు క్లిక్ చేయండి

గతేడాది బ్యాంక్‌ 139 శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 22,542లకు చేరుకున్నాయి. మరోవైపు, బ్యాంక్‌నకు సంబంధించి సబ్సిడరీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారి సేవలను కూడా బ్యాంక్‌ వినియోగించుకోబోతున్నది. ముఖ్యంగా ఆఫీస్‌ వర్క్‌, మార్కెటింగ్‌, రికవరీ కోసం వీరిని వాడుకోనున్నది.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ 2024  :

Published date : 16 May 2024 07:44PM

Photo Stories