Agniveer Vayu Recruitments 2025 : అవివాహిత నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత వాయుసేన నోటిఫికేషన్ విడుదల..

సాక్షి ఎడ్యుకేషన్: భారత వాయుసేన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిరుద్యోగులు, భారత వాయుసేనలో ఉద్యోగం చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారికి అవకాశం. ఇక్కడ, అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) (02/ 2025) ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి ఇటీవలె నియామక ప్రకటన విడుదలైంది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' చేపట్టే ఈ నియామకంలో నాలుగేళ్ల లిమిటెడ్ సర్వీస్‌తో రిక్రూట్‌మెంట్ చేపడతారు.
Mega Job Mela: ఫిబ్రవరి 16న మెగా జాబ్‌మేళా.. అందుబాటులో ఉన్న 5,200 ఉద్యోగాలు
ఉద్యోగ వివరాలు..
అర్హత: ఇంటర్‌లో 50శాతం, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, లేదా ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు, నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలతోపాటు స్పోర్ట్స్ అడీవ్‌మెంట్స్ కూడా తప్పనిసరి. అవివాహిత నిరుద్యోగులు మాత్రమే అర్హులు.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, లాన్ టెన్నిస్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్.
అభ్యర్థి వయసు, ఎత్తు: 3 జూలై 2004 నుంచి 3 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి, కనీసం 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం: ఎంపిక పరీక్ష, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రక్రియ: ఆన్‌లైన్‌లో.. రూ. 100 ఫీజుతో దరఖాస్తులు చేసుకోవాలి.
AP High Court Jobs: డిగ్రీ అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22
రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: మార్చి 10 నుంచి 12 వరకు ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- bharat agniveer job notification
- agnipath vayu
- unmarried unemployees
- online applications
- job applications for agniveer vayu
- job notifications latest
- online applications and vacancies for agiveer vayu
- unmarried youth for agniveer vayu
- agniveer vayu recruitments
- latest recruitments at agniveer vayu
- February 22
- inter eligibilities jobs latest news
- agniveer vayu jobs latest
- entry test for agniveer vayu jobs
- sports eligibilities for agniveer vayu jobs
- Education News
- Sakshi Education News