Digital Classes in Govt Schools : సర్కార్ బడుల్లో డిజిటల్ తరగతులు.. రోజూ గంటన్నర..

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని పాలమూరు ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ క్లాస్ విద్యార్థుల చదువు మరింత మెరుగు పడాలని, మెరుగైన విద్యను అందించేందుకు ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్. తరగతి గదుల్లో ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ, డిజిటల్ బోర్డు) ఏర్పాటు చేసి, కొద్ది రోజుల నుంచి డిజిటల్ కంటెంట్ క్లాసులను ప్రారంభించారు.
రోజూ గంటన్నర..
ఐఎఫ్‌పీ ప్యానల్స్ అందుబాటులో ఉన్న స్కూల్స్‌లో పెన్ డ్రైవ్ ద్వారా డిజిటల్ కంటెంట్ సాఫ్ట్ వేర్‌ను డౌన్ లోడ్ చేశారు. ఇక, ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులను మినహాయించి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజి, సోషల్ సజెక్టులను చాప్టర్లా వారీగా డిజిటల్ కంటెంట్‌ను బోధిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. కంటెంట్‌లోని పెద్ద పెద్ద డయాగ్రామ్స్, చార్టులు డిస్ప్లే అవుతుండటంతో విద్యార్థులకు మరింత సులువుగా మారింది బోధన.
NIRD Jobs 2025 : నెలకు 2,50,000 జీతం.. నిరుద్యోగులకు ఎన్ఐఆర్‌డీ గుడ్ న్యూస్.. అర్హతలివే..
ఇక, ఉపాధ్యాయులంతా, ఈ శిక్షణను విద్యార్థులకు అందించేందుకు, ముందుగా వారు శిక్షణ పొందారు. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషలిస్టులతో ఎమ్మెల్యే యోన్నం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ ట్రైనింగ్‌ను నెలన్నరపాటు నిర్వహించారు. ఇక ఆ టీచర్లు మరికొందరి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడంతో అందరు కలిసి విద్యార్థులకు శిక్షణను అందిస్తున్నారు.
పంపిణీ కంటిన్యూ..
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే తనకుతానే గతేడాది నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లో పదో తరగతి పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు ఫ్రీగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అయితే, వారి తుది ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించగా, ఈ ఏడాది కూడా ఆ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని సర్కార్ బడుల్లో పంపిణీ పూర్తి కాగా.. మిగిలిన పుస్తకాలను ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు.
Changes in BSc Syllabus : బీఎస్సీ సిలబస్‌లో మార్పులు.. ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..
అయితే, యెన్నంను మాదిరిగానే దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్న స్టూడెంట్లకు గత నెల రోజుల నుంచి ఫ్రీగా డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్నారు. వారు కూడా తమ సొంత డబ్బును ఖర్చు చేసి పుస్తకాలను ప్రింటింగ్ చేయిస్తున్నారు.
నాలుగు రకాల పుస్తకాలు
డిజిటల్ ఎడ్యుకేషన్ లేని బడుల్లో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ పుస్తకాలను పదో తరగతి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారికి ఇంగ్లిష్‌లో, తెలుగు మీడియం చదువుతున్న వారికి తెలుగులో ఈ పుస్తకాలను ఇచ్చారు. ఇందులో ఉండే క్యూ ఆర్ కోడ్‌ను ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఫోన్‌లో ఓపెన్ అవుతుంది. వాటి పరిచయాలు, వివరణలు మరింత సమాచారం కూడా అందులో ఉంటాయి. దీంతో విద్యార్థులకు చదువుకోవడం మరింత ఆసక్తిగా మారింది.
ఎమ్యెల్యే సార్.. థ్యాంక్స్..
అనేక మంది విద్యార్థులకు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ అందుతుంది. సర్కార్ బడుల్లో చాలావరకు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అయితే, ఈ కార్యక్రమంతో, సర్కార్ బడుల్లోని విద్యార్థులు కూడా తమ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయని, వాళ్లు కూడా ఆ క్లాసెస్‌ను వినడమే కాకుండా పాఠాలను స్క్రీన్‌పై చూస్తున్నామని చెబుతున్నారు.
ముఖ్యంగా, టెన్త్ పరీక్షల సమయంలో ఈ-కంటెంట్ ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థం అవుతోందని, క్లాస్‌లో సందేహాలుంటే, ఇంటికి వెళ్లిన తరువాత క్యూఆర్ కోడ్ సహకారంతో పూర్తిగా సందేహాలు క్లియర్ అవుతున్నాయని, పరీక్షల సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుందని, ఇంట్లో ఉండే ఫోన్‌లో క్లాస్ వింటున్నామని.. ఎమ్మెల్యే యెన్నం సార్‌కు థ్యాంక్స్ చెప్పారు. విద్యార్థులు.. కె.భార్గవి, టెన్త్ క్లాస్, గాంధీ రోడ్ హైస్కూల్, మహబూబ్‌నగర్, - అమ్రిన్ తబస్సుం, టెన్త్ క్లాస్, గాంధీ రోడ్ హైస్కూల్, మహబూబ్‌నగర్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- government schools
- Tenth Students
- Digital education
- students education development
- mla yennam
- tenth students digital education
- e books for tenth students
- teachers training for digital education
- three months training
- Palamuru Government Schools
- morning classes for tenth students
- Digital Classes
- digital content classes
- digital classes in govt schools tenth students
- Education News
- Sakshi Education News
- technology development in govt schools