National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్‌కు స్వర్ణ పతకం

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఫిబ్రవరి 12వ తేదీ జరిగిన మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్‌లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది.
ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. ఫిబ్రవరి 11న జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్‌లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.
ఫిబ్రవరి 12వ తేదీ పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది.
National Games: జాతీయ క్రీడల్లో రెండో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్!