Skip to main content

Free Training: బ్యూటీకేర్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్ష‌ణ‌.. అర్హులు వీరే..

Free Training in Beauty Care Assistant Course  Director A. Purnima of Janashikshana Sansthan announcing free beauty care assistant training classes  free beauty care assistant training classes by Janashikshana Sansthan starting August 1

మొగ‌ల్రాజ‌పురం(విజ‌య‌వాడ తూర్పు): మ‌హిళ‌ల్లో నైపుణ్యాలు పెంచి వారికి ఉపాధి చూపేందుకు ఆగ‌స్టు 1వ తేదీ నుంచి త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో బ్యూటీకేర్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని జ‌న‌శిక్ష‌ణ సంస్థాన్ డైరెక్ట‌ర్ ఎ.పూర్ణిమ జూలై 26వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

18 నుంచి 45 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న మ‌హిళ‌లు ఈ శిక్ష‌ణ‌లో పాల్గొన‌డానికి అర్హుల‌న్నారు. ఆస‌క్తిగ‌ల వారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డుతో ఆగ‌స్టు 1వ తేదీలోగా విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురం రావిచెట్టు సెంట‌ర్‌లో ఉన్న త‌మ సంస్థ‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఇత‌ర స‌మాచారం కోసం 0866 2470420 సంబ‌ర్‌ను సంప్ర‌దించవ‌చ్చ‌ని ఆమె అన్నారు.

Medical Jobs: 108 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!

Published date : 29 Jul 2024 09:28AM

Photo Stories