Skip to main content

Free Beautician Courses: బ్యూటీషియన్‌ కోర్సులతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

ఆసిఫాబాద్‌ అర్బన్‌: మహిళా సంక్షేమశాఖ ద్వారా జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న బ్యూటీ షియన్‌ కోర్సులతో విద్యార్థినులు, యువతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు.
Economic development should be achieved with beautician courses

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 4న‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోర్సు పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు అందించారు.

ప్రభుత్వం అందిస్తున్న టైలరింగ్‌, బ్యూటీషియన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను అర్హులు వినియోగించుకోవాలని సూచించా రు. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్నందున బ్యూటీషియన్‌ కోర్సు పూర్తి చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

చదవండి: Vocational Trainers : ఈ పాఠ‌శాల‌ల్లోని ఒకేష‌న‌ల్ ట్రైన‌ర్ల‌కు రెన్యూవ‌ల్‌..!

కాగజ్‌నగర్‌, బెండారాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 45 రోజుల బ్యూటీషియన్‌ కోర్సు పూర్తి చేసిన 93 మంది డిగ్రీ విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి భాస్కర్‌, డీఆర్‌డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 05 Sep 2024 03:43PM

Photo Stories