Skip to main content

Skill Sprint Internship: విద్యార్థులకు ‘స్కిల్‌ స్ప్రింట్‌’ ఇంటర్న్‌షిప్‌.. ఈ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ..

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘టీ వర్క్స్‌’, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ సంయుక్తాధ్వర్యంలో ‘స్కిల్‌ స్ప్రింట్‌’ పేరిట ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.
Skill Sprint internship programme  Skill development program launch for students and unemployed youth in Hyderabad

జ‌న‌వ‌రి 16న‌  ప్రోగ్రామ్‌  పోస్టర్‌ను సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

స్కిల్‌ స్ప్రింట్‌ ఇంటర్న్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి 90 రోజులని, ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, రోబోటిక్స్, మేనేజ్‌మెంట్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

చదవండి: Free Swayam Courses: ఉచిత కోర్సుల వేదిక.. స్వయం!.. స్వయం ప్రత్యేక కోర్సులు ఇవే..

సంబంధిత పరిశ్రమల నిపుణులు మార్గనిర్దేశనం (మెంటార్‌ షిప్‌) చేస్తారని, సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ శిక్షణను పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్కిల్స్‌వర్సిటీ ద్వారా అకడమిక్‌ క్రెడిట్స్‌ ఇస్తామన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఆసక్తి గల కళాశాలలు, విద్యార్థులు టీ–వర్క్స్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దీనికి సంబంధించిన వివరాలు yజీటu.జీn వెబ్‌సైట్లో దొరుకుతాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో టీ– వర్క్స్‌ సీఈవో తనికెళ్ల జోగిందర్, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఛమాన్‌ మెహతాలు పాల్గొన్నారు.   

Published date : 17 Jan 2025 03:18PM

Photo Stories