Skip to main content

‘టాస్‌’లో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

కొడంగల్‌ రూరల్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) ద్వారా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జెడ్పీహెచ్‌ఎస్‌(బాలుర) హెచ్‌ఎం, స్కూల్‌ కో ఆర్డినేటర్‌ మురళీధర్‌, అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ గోపీనాథ్‌ ఆగ‌స్టు 23న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Open tenth and inter admissions in TOSS

సెప్టెంబర్‌ 20 వరకు అడ్మిషన్‌కు అవకాశం ఉందని చెప్పారు. పదవ తరగతి అడ్మిషన్‌కు గతంలో చదవిని టీసీ లేదంటే జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు రెండు సెట్ల జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు అందజేయాలని సూచించారు.

చదవండి: TOSS: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడ‌గింపు

ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌కు 10వ తరగతి మెమో, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్‌ కార్డు రెండు సెట్ల జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను జెడ్పీహెచ్‌ఎస్‌(బాలుర) కొడంగల్‌ పాఠశాలలో అందజేయాలన్నారు.

Published date : 24 Aug 2024 02:10PM

Photo Stories