Skip to main content

Tomorrow All Schools and Colleges Holiday 2024 : రేపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వును ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : 2024 జూలై 17వ తేదీన (బుధ‌వారం) స్కూల్స్‌, కాలేజీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెల‌వును ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆఫీస్‌ల‌కు కూడా సెలవు ఇచ్చారు. ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం ఒకటి.
Tomorrow All Schools and Colleges Closed 2024

కొన్ని ప్రాంతాల్లో ఈ పండ‌గ‌ను పీర్ల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్ని గుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా.. అదే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు తమ రక్తంతో శోక తప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు. మహ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు.

☛ All Schools and Colleges Holidays Due to Heavy Rain 2024 : అతి భారీ వ‌ర్షాలు.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ! మొత్తం ఎన్ని రోజులంటే..?

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీలకు జూలై 27వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించింది తెలంగాణ‌ ప్ర‌భుత్వం. తెలంగాణ పెద్ద పండగ‌ల‌లో బోనాలు ఒక‌టి. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ రోజున సెలవు ప్రకటించారు.  అలాగే తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవుదినం ఉంది. అలాగే మ‌ళ్లీ రోజు జూలై 28వ తేదీన ఆదివారం. దీంతో వ‌రుస‌గా జూలై 27, 28వ తేదీల్లో సెల‌వులు రానున్నాయి.

జూలై 18. 19 తేదీల్లో విద్యాశాఖ స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం..?రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించించిన విష‌యం తెల్సిందే. రానున్న ఐదు రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఏపీలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జూలై 18, 19వ తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.

ఇప్ప‌టికే IMD హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. గోవా,  కర్నాట‌క‌, కేర‌ళ‌లోని అన్ని స్కూల్స్‌,  కాలేజీల‌కు సెల‌వులను ప్ర‌క‌టించారు. దాదాపు ఈ రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ఇచ్చారు. అలాగే రానున్న ఐదు రోజులు తెలంగాణ‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సెల‌వుల‌పై విద్యాశాఖ ఎటువంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు.  IMD హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. జూలై 18. 19 తేదీల్లో విద్యాశాఖ స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు విద్యాశాఖ అధికారులు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్కూల్స్‌,కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇలా..
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 16 Jul 2024 06:42PM

Photo Stories