Skip to main content

Foundation Literacy and Numeracy: విద్యాసామర్థ్యాలు మెరుగుపర్చేలా లిప్‌..!

కెరమెరి(ఆసిఫాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లోని విద్యార్థుల విద్యాసామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
To improve educational abilities

ఇందుకోసం ప్రాథమికస్థాయిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌(ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ), ఉన్నత విద్యార్థుల ప్రగతి కోసం ఎల్‌ఐపీ(లర్నింగ్‌ ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాం) కార్యక్రమాలను పునరుద్ధరించారు. ఆయా కార్యక్రమాలు ఎన్నికల సమయంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఆగస్టు 1 నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో యథావిధిగా అమలు చేస్తున్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లిష్‌పై సరైన పట్టు సాధించడం.. చదవడం, రాయడంలో మెరుగుపర్చడమే లక్ష్యంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఐపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

చదవండి: AICTE: సత్తా చాటేలా సిలబస్‌!

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో మొత్తం 721 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 561, ప్రాథమికోన్నత 100, ఉన్నత పాఠశాలలు 60 వరకు ఉండగా.. 15 కేజీబీవీలు, రెండు మోడల్‌ స్కూళ్ల ఉన్నాయి. ఇందులో 45వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు.

2022లో ప్రారంభమైన ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ కార్యక్రమం గతేడాది ఎన్నికల కారణంగా అటకెక్కింది. దీంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కనీస సామర్థ్యాలు తగ్గిపోయాయి. విద్యార్థులు చదవడం, రాయడంలో తడబడుతున్నారు. విద్యావ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం, విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రత్యేక యాప్‌ ద్వారా ఆగస్టు, డిసెంబర్‌, మార్చిలో ప్రత్యేక టెస్టులు నిర్వహించనున్నారు. వాటి ద్వారా చిన్నారుల అభ్యసన సామర్థ్యాలు అంచనా వేయనున్నారు. ఐదో తరగతి వరకు అక్షర పునాదిని పటిష్టం చేయనున్నారు. విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు కూడికలు, తీసివేతలపై కూడా పట్టు సాధించేలా ప్రోత్సహించనున్నారు.

ఒకటో తరగతిలో నిమిషానికి 20 పదాలు, రెండో తగరతిలో 25, మూడు, నాలుగో తరగతి విద్యార్థులకు 40, ఐదో తరగతి విద్యార్థులకు 50 పదాల ధారాళంగా చదవడం రావాలి. విద్యార్థిలో కనీస సామర్థ్యాలను అంచనా వేసి రానున్న కాలంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందించారు.

హైస్కూల్‌ విద్యార్థులకు లిప్‌

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు కోసం ప్రత్యేకంగా లిప్‌(లర్నింగ్‌ ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని అమలు చేస్తున్నారు.

తరగతి గది బో ధన మెరుగుపర్చడం, విద్యార్థులు తెలుగులో రా యడం, చదవడం, టీచర్లలో సామర్థ్యాలను పెంచ డం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఏం చ దివారో.. ఏం నేర్చుకున్నారో.. చెప్పలేని పరిస్థితి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ముందుగా బేస్‌లైన్‌ టె స్టులు నిర్వహిస్తారు. దీని ఆధారంగా విధ్యార్థుల ప్ర గతిని అంచనా వేస్తారు. ఉపాధ్యాయులు ఎలా చె బుతున్నారో ప్రత్యేక బృందాలను నియమించారు. టీచర్లు పాఠ్యప్రణాళిక తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రణాళిక ప్రకారమే పాఠాలు బోధించాలి.

విద్యా సామర్థ్యాల పెంపే లక్ష్యం

ప్రతీ విద్యార్థిలో కనీస విద్యా సామర్థ్యాలు, బోధనాభ్యాసన ప్రక్రియలు పెంపే లక్ష్యంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఎల్‌ఈపీ కార్యక్రమాలు కొనసాగుతాయి. నవంబర్‌లో నిర్వహించే నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తాం. కనీస అభ్యసన సామర్థ్యాల ఆధారంగా వర్క్‌బుక్‌లు పూర్తి చేయాలి.

– ఉప్పులేటి శ్రీనివాస్‌, ఏఎంవో

Published date : 24 Aug 2024 01:56PM

Photo Stories