Teacher Education System: మా‘స్టార్లు’గా మార్చేందుకు..
కొద్ది రోజుల క్రితం రాష్ట విద్యా శాఖ కమిషనర్ బాపట్ల జిల్లాలోని ఓ పాఠశాలను సందర్శించారు. ఆయన పాఠశాల ఆవరణలోకి అడుగుపెడుతుంటే.. జిల్లా విద్యా శాఖాధికారుల నుంచి ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతున్నారు. కానీ కమిషనర్ చూపంతా పాఠశాల ఆవరణపైనే కేంద్రీకృతమైంది. నాడు–నేడుతో రూపురేఖలు మార్చుకుంటున్న పాఠశాల పురోగతిపైనే దృష్టి నిలిచింది. వెంటనే తరగతి గదిలో విద్యార్థుల కదలికలను ఆ చూపు నిశితంగా గమనించింది.
also read: AP schools: పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
పాఠాలు చెప్పే టీచర్ల విద్యా విధానాన్ని పసిగట్టింది. అనంతరం అక్కడ లోపాల్ని గుర్తించింది. పాఠశాల పరిశీలనలో తెలుసుకున్న విషయాలపై అక్కడ హెచ్‌ఎంతో చర్చించారు. విధుల్లో అలసత్వం వహించిన ఒక టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం మరో పాఠశాలలో కొన్ని లోపాలు గుర్తించారు. మరో టీచర్‌కు పనిష్‌మెంట్ .. ఇలా వెళ్లి ప్రతి చోటా ఏదొక లోపాలు బయటపడడంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వం అత్యున్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకుంది. అదే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని హెచ్‌ఎంలకు నాయకత్వ శిక్షణ.
also read: AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్ నిషాంత్‌కుమార్
సమగ్రంగా.. సంపూర్ణంగా..
బాపట్ల కలెక్టరేట్‌లోని విస్తర్ణ కేంద్రంలో ఈనెల 23 నుంచి ఆరురోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సుమారు రెండు వందల మంది ప్రధానోపాధ్యాయులకు శిక్షణ తరగతుల్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రారంభించారు. తొలుత జట్టు బాగుండాలంటే నాయకుడు సమర్థుడై ఉండాలి. అందుకే పాఠశాల ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలంటే ప్రధానోపాధ్యాయుడు సమగ్ర అవగాహనతో ఉండాలి. ఈ దృక్పథంతోనే పాఠశాలల నిర్వహణపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ప్రారంభించారు.
Also read: Fee Reimbursement: ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు
కార్పొరేట్‌ను తలదన్నేలా..
ఎనిమిది నుంచి పదో తరగతి పిల్లలకు బైజూస్ ద్వారా క్లాసులు అందిస్తోంది. ప్రభుత్వ, కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తోంది. దీంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తోంది. మరో వైపు ప్రతి విద్యార్థి బడిబాట పట్టేందుకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కానుక, గోరుముద్ద వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇంతలా విద్యా రంగంలో మార్పు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్న సమయంలో.. నిర్వహణ లోపంతో విద్యా వ్యవస్థ గాడి తప్పకూడదనే సంకల్పంతో ప్రభుత్వం హెడ్మాస్టర్లకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Also read: TS OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం... చివరి తేదీ ఇదే..
ప్రతి అంశంపై క్షుణ్ణంగా..
బాహుబలి సినిమాలో నాయకుడిని తొలుత అంతమొందిస్తే.. సైన్యం కకావికలమవుతుందని చెబుతారు. ఇదే సూత్రంపై నాయకుడు బలంగా ఉంటే అక్కడ సైన్యం కూడా సమర్థవంతంగా ఉంటుందనే లక్ష్యంతో హెడ్మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో ప్రధానంగా హెడ్మాస్టర్లు.. నాడు–నేడు పనుల నిర్వహణ, తరగతుల కేటాయింపు, నిధుల వినియోగం, విద్యార్థుల హాజరు సామర్థ్యం పెంపుదల, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల నైపుణ్యాల మదింపు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై ప్రతి రోజూ దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే వీటి నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో వెనుకబడుతున్నారు. ఇది పూర్తిగా వ్యవస్థపైనే ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ప్రారంభించింది. ప్రస్తుతం బాపట్ల పట్టణంలో ఐదు జిల్లాల హెడ్మాస్టర్లకు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభంలోనూ, చివరలోనూ మదింపు చేస్తారు. అనంతరం మరొక బ్యాచ్ కు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కోసం 12 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేశారు. వీరిని సమగ్ర శిక్షణ వారు పర్యవేక్షిస్తుంటారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని హెడ్మాస్టర్లు ఆనందంగా చెబుతున్నారు.
Also read: AP Open School: సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు ముందంజ
నాయకుడికి మరింత బలాన్ని ఇస్తున్నాం
పాఠశాలల్ని శ్రేష్టత వైపు నడిపించడానికి , మా విద్యార్థులకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందజేసేందుకు అవసరమైన సాధనాలు, వనరుల్ని అందించడానికి నేను కట్టుబడి ఉన్నాను. నాయకత్వం అనేది విజయవంతమైన పాఠశాల నిర్వహణలో కీలకమైన భాగం. వ్యూహాత్మక ఆలోచన, ప్రతిభావవంతమైన కమ్యూనికేషన్ టీం బిల్డింగ్ సహా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అనేక విషయాలపై ఆచరణాత్మక మార్గదర్శకత్వం అందించడానికి రూపొందించబడింది ఈ నాయకత్వం.
–ఎ.శ్రీనివాసరావు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష విజయవాడ ఆంధ్ర ప్రదేశ్
Also read: Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యకు ఊతం @ 100% fee reimbursement