Skip to main content

Civils winners 2023: ప్రజా సేవ చేసే అవకాశాన్ని, గౌరవాన్ని సివిల్స్ ఇస్తుంది.. BC సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం

లక్ష్యం ఉన్నతమైనదైతే అవకాశాలు అవే వస్తాయి

- పేదరికం ప్రతిభకు అడ్డు కాదు
- బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం,  ఐఎఎస్ 

ప్రజా సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించి వారికి సేవ చేస్తూ గౌరవాన్ని పొందే అవకాశం కేవలం సివిల్ సర్వీస్ లోనే లభిస్తుందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐఎఎస్ అన్నారు. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీస్ సాధించాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే ఎంచుకొని గమ్యాన్ని  చేరుకునే అవకాశాలను సద్వినియోగం  చేసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ ఏడాది సివిల్స్ టాపర్ లో గురుకుల విద్యాసంస్థల్లో చదివిన వారు ఉండడం అభినందనీయమన్నారు.

Also read: ASP Hanumanthu: భిక్షాటన చేసుకుని చదివి.. ఐపీఎస్‌ అయ్యాను.. ఇలా..

గురుకుల విద్య అత్యున్నతమైన క్రమశిక్షణ నిస్తుందనడానికి సివిల్స్ టాపర్ గా నిలిచిన వారే నిదర్శనమని ఆయన అన్నారు.   బీసీ గురుకులం లో ప్రాథమిక విద్యను, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో అవరోధాలను అధిగమించి  తాను సివిల్స్ సాధించానని, ఈరోజు మరికొందరు యువత పేదరికాన్ని సవాల్ చేస్తూ సివిల్స్ టాపర్ గా నిలవడం వారి నిబద్ధత కు నిదర్శనం అన్నారు. బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సివిల్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

civils rankers


Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ రూపొందించిన కెరియర్ గైడెన్స్ కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ప్రతిభ ఉన్న వారికి సివిల్స్ , గ్రూప్స్ కోచింగ్ సంక్షేమ శాఖ అందిస్తుందని ఆయన చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. 

విశిష్ట అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ 
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఓటమి పాఠాలను గెలుపు బాటలుగా మార్చుకోవాలన్నారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి విజయం సాధించిన సివిల్స్ ర్యాంకర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

also read: "No Caste, No Religion" పై తెలంగాణ హైకోర్టులో చారిత్రాత్మక తీర్పు...!

ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్  ప్రొఫెసర్ చింత గణేషం మాట్లాడుతూ సివిల్స్ సాధించాలని ఆసక్తి ఉన్నవాళ్లకి ఉస్మానియా యూనివర్సిటీ అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి ఏటా సివిల్స్ విజేతలతో ముఖాముఖి నిర్వహించి యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు.  

ఉస్మానియా యూనివర్సిటీ, డెవలప్మెంట్ , యూజీసీ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం మాట్లాడుతూ  ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, కష్టపడితే అవకాశాలు వస్తాయన్నారు. 
 

civils rankers 2022

also read: Daily Current Affairs in Telugu | 21st July 2023 | #Sakshieducation

ఈ కార్యక్రమంలో సివిల్స్ లో ఆలిండియా మూడవ ర్యాంకు సాధించిన ఉమా హారతి, 35ర్యాంకర్  సాంకేత్ కుమార్, 60 ర్యాంకర్ సాయి ప్రణవ్, 94వ ర్యాంకర్ సాయి కృష్ణ, 200 ర్యాంకర్ మహేష్ కుమార్, 410 ర్యాంకర్ రేవయ్య, 510 ర్యాంకర్ ప్రణీత్, 548 ర్యాంకర్ హిమ వంశీ, 646 ర్యాంకర్ అపూర్వ తదితరులు పాల్గొని తాము  సివిల్ సాధించడంలో ఎదుర్కొన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "అమ్మానాన్న అనురాగం" డాన్స్ కాంపిటీషన్లో  విజేతలకు అవార్డులు అందించారు. ఫస్ట్ ప్రైజ్ మహేశ్వరం గేట్ ఎంజెపి స్కూల్ విద్యార్థులు, 2వ ప్రైజ్ క్యాండర్ ష్రైన్ గ్రూప్, మూడవ ఫ్రైజ్ కేశంపేట దౌలతాబాద్ ఎంజెపి బాయ్స్ స్కూల్ విద్యార్థులు అందుకున్నారు. 

Also read: UPSC Civils Preparation Plan for Contemporary Issues | Balalatha #sakshieducation

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చల్లమల్ల వెంకటేశ్వర రావు, ప్రొఫెసర్ మంగు, సైకాలజిస్ట్ వీరేందర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి,  బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,  బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చంద్రశేఖర్, అలోక్ కుమార్, తిరుపతయ్య, జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్స్,  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఎంజెపి, ఇతర స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also read: APPSC: English Articles for Competitive Exams

prize

అమ్మానాన్న అనురాగం

*ఈ కార్యక్రమం అనంతరం సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు రచించిన  "అమ్మానాన్న అనురాగం" పాటపై విశ్వసాహితీ ట్రస్ట్ నిర్వహించిన డాన్స్ కాంపిటీషన్లో  విజేతలకు అవార్డులు అందించారు. ఫస్ట్ ప్రైజ్ మహేశ్వరం గేట్ ఎంజెపి స్కూల్ విద్యార్థులు, 2వ ప్రైజ్ క్యాండర్ ష్రైన్ గ్రూప్, మూడవ ఫ్రైజ్ కేశంపేట దౌలతాబాద్ ఎంజెపి బాయ్స్ స్కూల్ విద్యార్థులు అందుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. *

- డి. శ్రీనివాస్ రెడ్డి
డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్స్, హైదరాబాద్.

Published date : 21 Jul 2023 08:40PM

Photo Stories