Skip to main content

"No Caste, No Religion" పై తెలంగాణ హైకోర్టులో చారిత్రాత్మక తీర్పు...!

హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్‌ దంపతులు తమ కుమారుడు ఇవాన్‌ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది.
రూప, డేవిడ్‌ దంపతులు తమ కుమారుడు ఇవాన్‌ రూడేకి
రూప, డేవిడ్‌ దంపతులు తమ కుమారుడు ఇవాన్‌ రూడేకి

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో చారిత్రాత్మక తీర్పువెలువరించింది.  హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్‌ దంపతులు తమ కుమారుడు ఇవాన్‌ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్‌ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్‌ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది.

Also read: Indian Geography: APPSC, TSPSC, SI Police | Previous Exam Questions Bitbank #sakshieducation


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుంది. ఇది భావప్రకటన స్వేచ్ఛలో భాగం కాబట్టి పిటిషనర్లు కోరినట్లుగా ‘బర్త్‌ సర్టిఫికేట్‌’ లో కుల రహిత, మత రహిత’ కాలాన్ని పొందపరచాలని, దీని కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. 

Also read: Rahul Gandhi: అసలు రాహుల్ గాంధీ కేసు చ‌రిత్ర ఏమిటి..? #sakshieducation

 వివరాల్లోకి వెళితే 2019, మార్చి 23న జన్మించిన తమ కొడుకు ‘ఇవాన్‌ రూడే’ బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం దంపతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు (బాబూ జన్మించిన ప్రాంతం). జనన నమోదు ఫారం లోని కుటుంబ ‘మతం’ అనే కలామ్‌ నింపితే తప్ప బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరదని సదరు అధికారులు చెప్పడంతో, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వీళ్ళు మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్‌ నింపడానికి నిరాకరించారు. ఆ కాలామ్‌ నింపితే తప్ప బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు జిల్లా కలెక్టర్‌ మొదలు పై అధికారులను ఆశ్రయించారు. తాము కోరిన పద్ధతుల్లో బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎట్టకేలకు  హైకోర్టులో పిల్‌ను దాఖలు (2019, ఆగస్టు 28న) చేశారు. 

Also read: భార‌తీయులు నిజంగా సంతోషంగా లేరా..? ఎందుకు..? | World Happiness Report 2023 | GK | Bala Latha Madam

తీర్పుపట్ల దంపతులు హర్షం....
తాము కోరినట్లుగా జస్టిస్‌ లలిత కన్నెగంటిగారు తీర్పు ఇవ్వడం పట్ల డేవిడ్‌, రూప దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Also read: TSPSC: Prof Haragopal New Committee - భారత దేశ సామాజిక నిర్మితి | TSPSC Group 1, 2, 3 & 4

ఈ దేశంలో కుల,మతాలకు అతీతంగా జీవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారని, వీటికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాట చరిత్ర కూడా ఉందని, మతాన్ని, కులాన్ని వదులు కుంటామని ఎవరైనా ముందుకు వస్తే వ్యక్తిగత స్థాయిల్లో ఏదో సర్దుబాటు చేస్తూ పరిష్కారం చూపుతున్నారే తప్ప చట్టం చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న తరుణంలో శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు. 

అభినందనలతో దంపతులు...
మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో, వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది కాబట్టి తమ లాంటి వాళ్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని జస్టిస్‌ లలిత కన్నెగంటి గారు ఇచ్చిన తీర్పు తమలాంటి వాళ్లకు న్యాయం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

Also read: అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పెళ్లితో సంబంధం లేదు.. కానీ || భర్త బలవంతం చేసినా.. 

Published date : 20 Jul 2023 03:35PM

Photo Stories