Schools and Colleges Holidays : నేడు, రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్: సహజంగా నవంబర్-డిసెంబర్ నెలలో అల్పపీడనాలు ఏర్పడు భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఈ కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుస సెలవులను ప్రకటిస్తుంది.
తాజాగా, నేడు బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా రూపు దాల్చింది. ఇది వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వచ్చే 24 నుంచి 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది.
పది జిల్లాలకు...
దీని ప్రభావంతో తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, అక్కడి ప్రభుత్వం చెన్నై సహా పది (10) జిల్లాలకు సెలవులు ప్రకటించింది. దీంతో, చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాడుథురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూరు, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు నేడు తెరచుకోవు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
తమిళనాడులో చెన్నై సహా.. కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో వర్షాలు దంచికొడుతుండగా.. తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.
Athletics Championship: అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయికి రజతం
ఎల్లో అలర్ట్ .. :
ఇదిలా ఉంటే, కంచీపురంలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం, ఈ నెల 14వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అంతేకాకుండా, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు చెబుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సహా వాతావరణ శాఖ హెచ్చరించారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు.. రేపు కూడా..?
ఏపీలోని తిరుపతి జిల్లాలోని నేడు అన్ని విద్యాసంస్థలకు ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ శుభం బన్సల్ గురువారం సెలవు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇచ్చామని చెప్పారు. అందరూ కచ్చితంగా సెలవు పాటించాల్సిందేనని ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాగే ఈ వర్షాలు కొనసాగితే.. రేపు కూడా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవులు ఇవే...
2025 జనవరి :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ కనుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26
ఫిబ్రవరి 2025 :
☛➤ మహ శివరాత్రి : 26
మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31
ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి : 05
☛➤ శ్రీరామ నవమి : 06
☛➤ అంబేడ్కర్ జయంతి : 14
☛➤ గుడ్ ఫ్రైడే : 18
మే 2025 :
మేడే : 1
జూన్ 2025 :
☛➤ బక్రీద్ : 07
జూలై : 2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21
ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27
సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21
అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20
నవంబర్ 2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05
డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26
Tags
- Holidays 2024
- holidays news updates
- schools and colleges holidays
- Heavy rains
- tamilnadu rains updates
- heavy rains updates
- schools and colleges updates
- school and colleges holidays updates
- heavy rainfall updates in telugu
- holidays for education institutions
- education institutions holidays news in telugu
- holidays due to heavy rains news in telugu
- holidays news in telugu
- heavy rains and floods updates
- holidays in tamilnadu updates
- government announcement on holidays
- education institutions holidays announcement
- Education News
- Sakshi Education News
- yellow alert