Skip to main content

AP Inter Public Exams Schedule 2025 : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీ ఇంటర్‌ ప‌బ్లిక్‌ పరీక్షలు తేదీలు విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిసెంబ‌ర్ 11వ తేదీన‌ విడుదల చేశారు.
AP Inter Public Exams Schedule 2025  Andhra Pradesh Education Minister Nara Lokesh releasing Inter exam dates  Inter first and second year public exam schedule 2025 Inter public exams 2025 conducted from March 1 to 20  AP Inter 2025 exam dates announced by Education Minister

ఈ ఇంట‌ర్ ఫ‌స్ట్‌, సెకండియర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు 2025 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.  ఇంట‌ర్ మెయిన్స్ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియనున్నాయి.

➤☛ AP 10th Public Exams Schedule 2025 : ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ 2025 విడుద‌ల‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే.. ఈసారి మాత్రం...

ఇంట‌ర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం...
ఏపీ ఇంట‌ర్ ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఇంట‌ర్ ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 05వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు. ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూష్ పరీక్ష‌ను ఫిబ్రవరి 1వ తేదీన‌, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 3వ తేదీన‌ ఉదయం 10.00 నుంచి 01.00 గంటల వరకు నిర్వహించనున్నారు. అఆగే సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఫిబ్రవరి 22వ తేదీన‌ నిర్వహించనున్నారు.

➤☛ Schools and Colleges Holidays 2025 Announcement : 2025లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు... ఏఏ నెల‌లో...

AP intermediate exams 2025 schedule :
➤☛ మార్చి - 01: సెకండ్ లాంగ్వేజ్ – I
➤☛ మార్చి - 03 : సెకండ్ లాంగ్వేజ్ – II
➤☛ మార్చి – 04 : ఇంగ్లీషు – I
➤☛ మార్చి – 05 : ఇంగ్లీషు – II
➤☛ మార్చి – 06 : మ్యాథ్స్– 1A, బోటనీ– 1, సివిక్స్– 1
➤☛ మార్చి – 07 : మ్యాథ్స్– 2A, బోటనీ– II, సివిక్స్– II
➤☛ మార్చి – 08 : మ్యాథ్స్– IB, జువాలజీ– I, హిస్టరీ – I
➤☛ మార్చి – 29 : మ్యాథ్స్– 2B, జువాలజీ– II, హిస్టరీ – II
➤☛ మార్చి – 11 : ఫిజిక్స్– I, ఎకానమిక్స్– I
➤☛ మార్చి – 12 : ఫిజిక్స్-II, ఎకానమిక్స్– II
➤☛ మార్చి – 13 : కెమిస్ట్రీ– I, కామర్స్– I
➤☛ మార్చి – 15 : కెమిస్ట్రీ– II, కామర్స్– II
➤☛ మార్చి – 17 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్– I, లాజిక్– 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ -1
➤☛ మార్చి – 18 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్– II, లాజిక్– II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ – II
➤☛ మార్చి – 19 : మోడ్రన్ లాంగ్వేజ్– I, జియోగ్రపి– I
➤☛ మార్చి – 20 : మోడ్రన్ లాంగ్వేజ్– II, జియోగ్రపి– II

AP Tenth Class Public Exams 2025 Schedule :
➤☛ 2025 మార్చి 17 (సోమ‌వారం) : ఫస్ట్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 19 (బుధ‌వారం) : సెకండ్ లాంగ్వేజ్
➤☛ 2025 మార్చి 21 (శుక్ర‌వారం) : ఇంగ్లీషు
➤☛ 2025 మార్చి 24 (సోమ‌వారం) : మ్యాథ్స్
➤☛ 2025 మార్చి 26 (బుధ‌వారం) : ఫిజిక్స్
➤☛ 2025 మార్చి 28 (శుక్ర‌వారం) : బయాలజీ
➤☛ 2025 మార్చి 31 (సోమ‌వారం) : సోషల్

Published date : 12 Dec 2024 08:43AM

Photo Stories