Education News:ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ తరగతులు ఎప్పటినుంచంటే?.....వేసవి సెలవుల్లో మార్పు!
Sakshi Education

ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న మొదలుకానుంది. 2025-26 విద్యా సంవత్సరాన్ని ముందుగా ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు మరిన్ని ఉపాధ్యాయ మార్గదర్శకాలను అందించేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: CUET UG 2025: నేడే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ-2025) రిజిస్ట్రేషన్ చివరి తేదీ
ఏప్రిల్7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 సెలవులను విద్యా సంవత్సరంలో భాగంగా ఇవ్వనున్నట్లు సమాచారం.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 24 Mar 2025 09:58AM