Nursing Job : నర్సింగ్ ట్యూటర్స్‌గా ప్రమోషన్లు
Sakshi Education
గుంటూరు మెడికల్ : గుంటూరు నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ట్యూటర్స్ గ్రేడ్–2 పోస్టులను శుక్రవారం ప్రమోషన్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేశారు.
గుంటూరు నర్సింగ్ కళాశాలలో ఏడు పోస్టులను, ఒంగోలు నర్సింగ్ కళాశాలలో ఒక పోస్టును గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ కౌన్సెలింగ్ నిర్వహించి స్టాఫ్ నర్సులుగా పనిచేస్తూ బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్నవారితో భర్తీ చేశారు. సకాలంలో ప్రమోషన్లు కల్పించినందుకు ఆర్డీకి నర్సింగ్ యూనియన్ నేతలు బెల్లంకొండ శైలజ, వెల్లంపల్లి పద్మజ కృతజ్ఞతలు తెలిపారు.
Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
Published date : 29 Jul 2023 05:20PM