YSRUHS: ఎంబీబీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2023–24 విద్యాసంవత్సరం ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జూలై 19న నోటిఫికేషన్ జారీచేసింది.
రాష్ట్ర కోటా కింద భర్తీచేసే ఈ సీట్లకు నీట్–2023లో ర్యాంకులు సాధించినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి తెలిపారు. జూలై 20 నుంచి 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు https://ugcq.ysruhs. com వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల వివరాలను, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. వివరాలకు http://drysr.uhsap.inలో చూడాలని, పత్రాల అప్‌లోడ్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 74165 63063, 74162 53073, 90634 00820 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
YSRUHS: పారదర్శకంగా వైద్యవిద్య అడ్మిషన్లు
AP Medical Seats 2023 : ఈ వైద్య కళాశాలల్లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు.. మిగిలినవి మాత్రం..
Published date : 20 Jul 2023 03:42PM