NEET 2023 Ranker Success Story : కశ్మీరీ కవలలు... నీట్‌లో అదరగొట్టారు...వీరి విజయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే..!
ఇందుకోసం రేయింబవళ్లు నిద్రాహారాలు మానేసి మరీ చదువుతుంటారు.
మొదటి ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించాలి అంటే ఈ మాత్రం కష్టం తప్పనిసరి. అయితే ఫస్ట్ సారి ర్యాంకు సాధించని వారు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వెళుతుంటారు. కానీ, మారుమూల ప్రాంతానికి చెందిన నిరుపేద విద్యార్థులు ర్యాంకులు సాధించారు అంటే అది మామూలు విషయం కాదు. అదీ ఇంట్లోని కవలలు ఇద్దరు ర్యాంకు కొట్టారంటే అది విశేషమే కదా.
NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్.. కీ కోసం క్లిక్ చేయండి
నిత్య కళ్లోలిత ప్రాంతమైన కశ్మీర్ నుంచి ఇద్దరు కవలలు తమ మొదటి ప్రయత్నంలోనే నీట్‌లో మెరిశారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లోనూ ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నీట్‌లోనూ ర్యాంకులు సాధించడంతో ఇప్పుడు కశ్మీరీ ప్రాంతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
NEET 2023 Top 10 Rankers : నీట్-2023 ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకర్ మన కుర్రాడే.. టాప్ 10 ర్యాంకర్స్ వీరే.. ఈ సారి మాత్రం..
జూన్ 13న విడుదలైన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో కశ్మీర్‌కు చెందిన కవలలు అదరగొట్టారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన ఓ ఇమామ్ కవల కూతుళ్లు తమ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. దక్షిణ కశ్మీర్ లోని ఓ మారుమూల గ్రామం కుల్గాం. ఆ గ్రామంలో ప్రార్థనలు చేసే ఇమామ్ సయ్యద్ సజాద్ కుమార్తెలు సయ్యద్ తబియా, సయ్యద్ బిస్మా నీట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి, ర్యాంకులు సాధించారు.
NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ పని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్నట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్ కొట్టానిలా..
ఈ ఇద్దరు కవలలు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో చేరడానికి ముందు 3 వ తరగతి వరకు స్థానిక ఇస్లామిక్ మోడల్ స్కూల్లోనే తాము విద్యనభ్యశించినట్లు చెప్పారు. చిన్ననాటి నుంచి ఒక లక్ష్యంతో ముందుకు సాగినట్లు చెప్పారు. చిన్నతనంలోనే అయితే డాక్టర్ లేకపోతే కలెక్టర్ అయ్యి తమ ప్రాంతానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కష్టపడి మరీ చదివారు. చదువు విలువ తెలిసిన వారి తండ్రి వారిని మరింత ప్రోత్సహించారు.
➤☛ NEET Cut-off Ranks
నీట్ కోసం శ్రీనగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించారు. తమకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో, ఆన్‌లైన్ క్లాస్‌లతో తమ ఫస్ట్ అటెంప్ట్‌లోనే 625, 570 మార్కులు సాధించారు. వీరితో పాటు శ్రీనగర్‌కు చెందిన మరో ఇద్దరు కవలలు కూడా నీట్‌లో ర్యాంకులు సాధించారు. శ్రీనగర్‌లోని షెహర్-ఇ-ఖాస్‌కు చెందిన రుత్బా బషీర్, తూబా బషీర్ నీట్‌లో ఉత్తీర్ణత సాధించారు.
ఈ కవల విద్యార్థినుల విజయం కశ్మీరీ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరైన మార్గదర్శకత్వం, మద్దతు ఉంటే మారుమూల ప్రాంతాల విద్యార్థులు సైతం అడ్డంకులను అధిగమించి గొప్ప విజయాలు సాధించగలరని వీరి విజయాలే నిరూపిస్తున్నాయి.