Eight New Medical Colleges in Telangana : తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు.. దాదాపు 10000 వరకు సీట్లు..!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు అయ్యాయి.
Eight new medical colleges in Telangana details
ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు లభించింది. దేశంలోనే అరుదైన రికార్డుకు తెలంగాణ చేరువైంది.
ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరబోతోంది. కేసీఆర్ పాలనతో.. గత 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఇక తాజా పరిణామంతో.. రాష్ట్రంలో పది వేలకు ఎంబీబీఎస్ సీట్లు చేరువ కానున్నాయి. మెడికల్ కాలేజీల మంజూరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు.. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.