Skip to main content

Medical Students: ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌...ఇక‌పై సీట్ల‌న్నీ స్థానికుల‌కే... ఎక్క‌డంటే

వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Medical Students
ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌...ఇక‌పై సీట్ల‌న్నీ స్థానికుల‌కే... ఎక్క‌డంటే

ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేశారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం మెడికల్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.

MBBS internship: ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... ప‌రీక్ష పేప‌ర్ల‌లోనూ అమ‌లు

NEET

ఈ స‌వ‌ర‌ణ‌ల‌కు ముందు 85 శాతం సీట్లు మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం సీట్లు అన్ రిజర్వుడుగా ఉండేవి. ఆ సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీప‌డేవారు. తాజా సవరణ వల్ల కొత్త‌గా ఏర్పాటైన క‌ళాశాల‌ల్లోని సీట్ల‌న్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

NEET 2023 Rankers: నీట్‌లో అద‌ర‌గొట్టిన‌ గొర్రెల కాప‌ర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డ‌బ్బులు లేక‌పోవ‌డంతో...

తెలంగాణ ఏర్పాటునుంచి సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగాయి. 

NEET

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. అందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా.. అంటే 280 సీట్లను కేటాయించాల్సి వచ్చేది. అన్‌ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీట్లు పొందేవారు. 

Telangana: నీట్ యూజీ-2023 ర్యాంకులు విడుద‌ల‌.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..

దీంతో అన్ రిజర్వుడు కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది ప్ర‌భుత్వం. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించ‌నున్నాయి.

NEET

ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడంవల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలవల్ల మొత్తం 1820 సీట్లు అదనంగా ప్రతి ఏటా దక్కనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోట 15% సీట్లు యధాతథంగా ఉంటాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.

NEET merit list: నీట్‌లో ఇక‌పై ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంకుల ప్ర‌క‌ట‌న‌... ఎప్ప‌టినుంచంటే....!

Published date : 04 Jul 2023 01:33PM

Photo Stories