NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
రాజస్థాన్‌లోని జామ్వా రామ్ గఢ్ పట్టణ పరధిలో ఉండే చిన్న గ్రామమైన నంగల్ తులసీదాస్ గ్రామానికి చెందిన రీతూ యాదవ్(19), కరీనా యాదవ్(20) ఇద్దరూ దగ్గరి బంధువులు. వీరి తల్లిదండ్రులు ఇద్దరూ స్థానికంగా గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చదివించేందుకు, కుటుంబ పోషణకు గొర్రెల ద్వారా వచ్చే ఆదాయమే వారికి ఆధారం.
NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్లకే పెళ్లి... 20 ఏళ్లకు పాప... ఐదో ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
నంగల్ తులసీదాస్ గ్రామం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పల్లెవాసులకు ఏమైనా సుస్తీ చేసినా, అత్యవసరమైన 18 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు ఆస్పత్రికి పరిగెత్తుకు వెళ్లాల్సిందే. పల్లెలో వైద్య సహాయం అందక ఎంతో మంది పడిన ఇబ్బందులను వీరిద్దరూ దగ్గరుండి చూశారు.
అప్పుడే నిశ్చయించుకున్నారు. తాము వైద్యులం కావాలని. డాక్టర్ అయిన తర్వాత తమ ఊరి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. కలలు కంటే సరిపోదు.. వాటిని సాకారం చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే కదా. చిన్ననాటి నుంచి చదువుల్లో ఎప్పుడూ ముందుడేవారు. కానీ, డబ్బులే ఎప్పుడూ ఉండేవి కాదు. అప్పొ సొప్పో చేసి వీరిని వారి తల్లిదండ్రులు ఇంటర్ వరకు చదివించారు.
NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ
రీతూ తండ్రి హనుమాన్ సహాయ్ పదో తరగతి వరకు, తల్లి సుశీల 8వ తరగతి వరకు చదివారు. హనుమాన్ చదివిన చదువుకు స్థానికంగా ఓ చిన్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం చేస్తూ ఊర్లోనే ఉంటూ తన కూతురుని, కుమారుడు ఆదిత్య యాదవ్‌ను చదివించేవాడు. అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి అనుకున్న సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడింది వారి మీద.
2002లో హనుమాన్ సహాయ్‌కు కంటిచూపు మందగించింది. దీంతో వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. కానీ, అందుకు సరిపడ డబ్బులు వారి వద్ద లేవు. దీంతో అరకొరగా వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్నేళ్లకు 2011లో రెండో కంటి చూపు మందగించింది. రెండు కళ్లు చూపు మందగించడంతో ఉన్న ఉద్యోగం ఊడింది. కుటుంబ పోషణకు ఇక గొర్రెల కాపరిగా మారిపోయాడు.
NEET 2023 Ranker Success Story : కశ్మీరీ కవలలు... నీట్‌లో అదరగొట్టారు...!
ఇక కరీనా తల్లిదండ్రులు నంచూరామ్, గీత నిరక్షరాస్యులు. వీరికి పక్కా ఇల్లు కూడా లేదు. నంచూరామ్ కూడా మేకలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితో ఆరోగ్యం సహకరించకపోవడంతో పరీక్షలు చేయిస్తే లంగ్స్ క్యాన్సర్ అని నిర్ధారణైంది. ప్రస్తుతం నంచూరామ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ రేడియోథెరపీ చేయించుకుంటున్నారు.
ఇలా కుంటుంబ పరిస్థితులు ఏ మాత్రం సహకరించకపోయినా రీతూ, కరీనా మాత్రం చదువును నిర్లక్ష్యం చేయలేదు. అమ్మాయిల ప్రతిభను గుర్తించిన మేనమామ తకర్సి యాదవ్ వారిని ప్రోత్సహించాడు. తకర్సీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో వారి చదువులకు కాస్త అండగా నిలిచాడు. కానీ, నీట్ అంటే సాధారణ విషయం కాదుగా. కోచింగ్‌కు లక్షల్లో ఖర్చవుతుంది. అంత డబ్బు వీరి దగ్గర లేదు. దీంతో ఓ స్వచ్ఛంద సంస్థ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
NEET 2023 Top 10 Rankers : నీట్-2023 ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకర్ మన కుర్రాడే.. టాప్ 10 ర్యాంకర్స్ వీరే
అలా రీతూ 2021లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి 2022లో తొలిసారి నీట్ యూజీకి హాజరైంది. 720 మార్కులకు 515 మార్కులు సాధించి తొలి ప్రయత్నంలోనే అదరగొట్టింది. మంచి ర్యాంకు కూడా వచ్చింది. అలాగే కరీనా 2019 లో 12 వ తరగతి పూర్తి చేసింది. 2020 లో నీట్ రాసి 440 మార్కులు, 2021 లో 545 మార్కులు, 2022 లో 559 మార్కులు సాధించింది.
మంచి మార్కులు వస్తున్నాయి. మార్కులతో పాటు ర్యాంకులు వస్తున్నాయి. కానీ, వారికి వచ్చే ర్యాంకులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం లేదు. ఇతర సీట్లకు ఫీజు కట్టే ఆర్థిక స్తోమత వీరికి లేదు. దీంతో విధిలేక రీతూ రెండో సారి, కరీనా నాలుగో సారి పరీక్షకు హాజరవ్వాల్సి వచ్చింది.
NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ పని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్నట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్ కొట్టానిలా..
వారి కష్టానికి 2023 నీట్ యూజీ ఫలితాలు ఉపశమనాన్ని ఇచ్చాయి. ఈ సారి రీతూ 645 మార్కులు సాధించి ఆలిండియా (ఏఐఆర్) 8179 ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ 3027 సాధించగా, కరీనా 680 మార్కులు సాధించి ఏఐఆర్ 1621 ర్యాంక్, కేటగిరీ 432 ర్యాంకు సాధించింది. ఈ ఫలితాలు చూశాక వారి కుటుంబాల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరి విజయాన్ని ఆ గ్రామవాసులంతా ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిమంతమైన కథనాలు, విద్యా సమాచారం కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఫాలో అవ్వండి.