Skip to main content

NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్ల‌కే పెళ్లి... 20 ఏళ్ల‌కు పాప... ఐదో ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేష‌న‌ల్‌ స్టోరీ

చ‌ద‌వుకోవాల‌నే త‌ప‌న త‌ప్పితే ఆ కుర్రాడికి ఇంకే ఆలోచ‌న‌లేదు. కానీ, 11 ఏళ్ల‌కే అనుకోని ప‌రిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. పెళ్లి చేసుకున్నా అత‌ని ధ్యాసంతా చ‌దువు మీదే. సంసారంతో పాటు చ‌దువును కొన‌సాగించాడు. అలా ప‌ది ప‌రీక్ష‌ల్లో మంచి మార్కుల‌తో పాస‌య్యాడు.
Ramlal married at the age of 11
Ramlal married at the age of 11

ఇంట‌ర్‌లోనూ మంచి ప‌ర్సంటేజ్ సాధించాడు. ఆ స‌మ‌యంలోనే నిర్ణ‌యించుకున్నాడు. ఎలాగైనా డాక్ట‌ర్ కావాల‌ని. ఇందుకోసం నీట్‌కు ప్రిపేర‌వ‌డం ప్రారంభించాడు. నీట్‌లో ర్యాంకు సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదుగా. అలా నాలుగు సార్లు దండ‌యాత్ర చేస్తూ చివ‌రికి ఐదో సారి ర్యాంకు సాధించిన రామ్‌లాల్ ఇన్స్ఫిరేష‌న్ స్టోరీ....

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

Ramlal

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా ఘోసుండా ప్రాంతానికి చెందిన రాంలాల్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జూన్ 13న ప్ర‌క‌టించిన నీట్ ఫ‌లితాల్లో స‌త్తా చాటి రాజ‌స్థాన్ పేరును వార్త‌ల్లో నిలిపాడు. 

రాంలాల్‌కు 11 సంవత్సరాల వయసులో వివాహమైంది. ఆ సమయంలో అతను 6వ తరగతి చదువుతున్నాడు. అయితే బాల్య వివాహం చేసుకున్నా చదువు కొనసాగించాలని నిర్ణ‌యించుకున్నాడు. అంత చిన్న వ‌య‌సులో ప‌రిణ‌తితో ఆలోచించాడంటే చాలా గొప్ప విష‌య‌మే. కానీ, అత‌ని తండ్రికి రాంలాల్ చ‌దువుకోవ‌డం సుత‌రామూ ఇష్టం లేదు.

NEET 2023 Ranker Success Story : క‌శ్మీరీ క‌వ‌ల‌లు... నీట్‌లో అద‌రగొట్టారు...!

NEET

రాంలాల్ చదువుకుంటానంటే అస్స‌లు ఒప్ప‌కోలేదు. రాంలాల్ ప‌ట్టుద‌ల ముందు అత‌ని తండ్రి త‌ల‌వంచాల్సి వ‌చ్చింది. రాంలాల్‌ చదువు పూర్తి చేయడానికి పూర్తి సహాయ స‌హ‌కారాలు అందించాడు.

రాంలాల్ భార్య కూడా 10వ తరగతి వరకు చదువుకుంది. మొదట, ఆమె తన చదువును కొనసాగించడానికి చాలా భయపడింది. భ‌ర్త ప్రోత్సాహంతో త‌న ప‌దిని పూర్తి చేసింది.

రాంలాల్ తన గ్రామంలోనే త‌న విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. స్థానికంగా ఉన్న‌ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. ప‌ది పరీక్షలలో 74 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 11, 12వ త‌ర‌గ‌తుల‌ను మంచి ప‌ర్సంటేజీతో పూర్తి చేశాడు. అప్పుడే డాక్ట‌ర్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్‌.. కీ కోసం క్లిక్ చేయండి

Ramlal

రాంలాల్ త‌న నిర్ణ‌యాన్ని భార్య‌తో పంచుకోగా మొద‌ట్లో ఆమె చాలా భ‌య‌ప‌డింది. ఉన్న‌త విద్యాభ్యాసం అంటే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అని భావించింది. కానీ, భ‌ర్త ప‌ట్టుద‌ల‌ని చూసి ఆమె మ‌ద్ద‌తుగా నిలిచింది. అలా 2019లో ఇంట‌ర్ పూర్త‌వ‌గానే నీట్ రాశాడు. ఇందుకోసం ఏ కోచింగ్ తీసుకోలేదు.

సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌తోనే ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. త‌న మొద‌టి ప్ర‌య‌త్నంలో 720 మార్కుల‌కు 350 మార్కులు మాత్ర‌మే సాధించ‌గ‌లిగాడు. ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ఓట‌మి ఎదురైనా ఏమాత్రం భ‌య‌ప‌డ‌లేదు. రెండో ఏడాది పూర్తి అంకిత‌భావంతో చ‌దివినా మళ్లీ నిరాశే ఎదురైంది. 

NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే.. ఈ సారి మాత్రం..

2020లో రెండో ప్ర‌య‌త్నంగా నీట్‌కు హాజ‌ర‌య్యాడు. ఆ ఏడాది రాంలాల్ 320 మార్కులు మాత్ర‌మే సాధించాడు. 2021లో మూడవ ప్రయత్నంలో 362 మార్కులు సాధించాడు. దీంతో విసిగిపోయిన రాంలాల్ ప్రిప‌రేష‌న్ కోసం స్థానికంగా ఉన్న ప్రొఫెస‌ర్ల స‌హాయం తీసుకున్నాడు. 2022లో నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష‌లో 490 మార్కులు సాధించాడు. కానీ, ఆశించిన ర్యాంకు రాలేదు.  

NEET

చివ‌ర‌గా త‌న 21వ ఏటా ఐదో ప్ర‌య‌త్నానికి సిద్ధ‌మ‌య్యాడు. నాలుగు సార్లు చేసిన త‌ప్పుల‌ను బేరీజువేసుకుని ఐదో ద‌ఫాలో ఏ ఒక్క చిన్న త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఐదో సారి ప్ర‌య‌త్నానికి సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలోనే త‌నకు ఓ పాప పుట్టింది. భార్య‌, పాప‌ను చూసుకుంటూనే ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యాడు. అలా 2023లో ఐదో సారి నీట్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. 

NEET merit list: నీట్‌లో ఇక‌పై ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంకుల ప్ర‌క‌ట‌న‌... ఎప్ప‌టినుంచంటే....!

ఈ సారి రాంలాల్ క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. ఫ‌లితంలో పాటు ర్యాంకు వ‌చ్చింది. 720 మార్కులకు 632 మార్కులు సాధించి ర్యాంకు సాధించాడు. త‌న కుటుంబంలో మొద‌టి డాక్ట‌ర్‌ను కాబోతున్నాన‌ని భావోద్వేగంతో రాంలాల్ త‌న స‌క్సెస్‌ను మీడియాతో పంచుకున్నాడు.

Published date : 19 Jun 2023 03:03PM

Photo Stories