Skip to main content

NEET UG Cut Off Marks 2024 Details : NEET UG 2024 కటాఫ్ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన‌ నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
NEET Cut Off Marks 2024  Admission to Medical Education Courses NEET UG 2024 Cut Off Marks Revealed

ఈ నీట్‌ యూజీ 2024 ఫ‌లితాల‌ను జూన్ 4వ తేదీన వెల్ల‌డించారు. అలాగే దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష కటాఫ్ మార్కులను కూడా వెల్లడించారు. 

☛ NEET 2023-24 BDS Cutoff Ranks in AP State Management Quota: Check College-wise Last Ranks

ఈ సారి విచిత్రంగా..
ఈ సారి విచిత్రంగా.. ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన మహారాష్ట్రకు చెందిన వేద్‌ సునీల్‌ కుమార్‌ షిండే సహా 67 మందికి ఫస్ట్‌ ర్యాంకులు ప్రకటించారు. ఫస్ట్‌ ర్యాంకర్‌కు 99.997129 పర్సంటైల్‌ రాగా, తెలంగాణ ఫస్ట్‌ ర్యాంకర్, జాతీయస్థాయి 77వ ర్యాంకర్‌ అనురాన్‌ ఘోష్‌కు 99.996614 పర్సంటైల్‌ వచ్చింది. ఎస్టీ టాపర్‌ నృపేష్‌కు 99.987314, అదే కేటగిరీలోని రెండో ర్యాంకర్‌ లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌కు 99.969357 పర్సంటైల్‌లు వచ్చాయి. 

ఈ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరు కాగా..
గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరు కాగా, ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా, ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. రాసినవారూ అర్హత సాధించివారూ పెరిగారు. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది హాజరుకాగా, 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది హాజరు కాగా, 47,371 మంది అర్హత సాధించారు. 

➤☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

నీట్‌ పరీక్ష సులువుగా ఉండటం వల్లే..
ఈసారి అర్హత మార్కు పెరిగింది. నీట్‌ పరీక్ష సులువుగా ఉండటం వల్లే ఈసారి అర్హత మార్కు పెరిగిందని నిపుణులు అంటున్నారు. గతేడాది జనరల్‌ కేటగిరీ/ ఈడబ్ల్యూఎస్‌లో అర్హత మార్కు 137 ఉండగా, ఈసారి అది 164 ఉండటం గమనార్హం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్‌ పీహెచ్, ఎస్సీ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 107గా ఉండగా, ఈసారి 129గా ఉంది. అన్‌ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్‌ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కు గతేడాది 121 ఉండగా, ఈసారి 140గా ఉంది.

నీట్‌ 2024 పరీక్షలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు సమాన మార్కులను పొందినట్లయితే.. మెరిట్‌లో ఎవరు ఎక్కువ స్థానంలో ఉండాలనేది టై బ్రేకింగ్ విధానం ద్వారా నిర్ణయించబడుతుంది. ఈసారి విద్యార్థులకు సమాన మార్కులు వస్తే వారి బయాలజీ మార్కులే ముందుగా వారి ర్యాంకును నిర్ణయిస్తాయి. బయాలజీ (బోటనీ అండ్ జువాలజీ)లో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ర్యాంక్‌లో ఎక్కువ స్థానం లభిస్తుంది. అలా కుదరకపోతే కెమిస్ట్రీ మార్కులను, ఆపై ఫిజిక్స్ మార్కులను పోల్చి చూసి ర్యాంక్‌ కేటాయిస్తారు.

☛ 100 MBBS seats per 10 lakh population:10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్లు..

ఈసారి అదే మార్కులు వచ్చినవారికి..
ఎస్టీ అండ్‌ పీహెచ్‌లో గతేడాది అర్హత మార్కు 108 ఉండగా, ఈసారి 129గా ఉంది. గతేడాది 450 మార్కులు వచ్చిన వారికి జనరల్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీటు రాగా, ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు రావొచ్చని శ్రీచైతన్య సంస్థల డీన్‌ శంకర్‌రావు విశ్లేషించారు. గతేడాది 600 మార్కులు వచ్చిన వారికి ఆలిండియా ర్యాంకు 30 వేలు ఉండగా, ఈసారి అదే మార్కు వచ్చినవారికి 82 వేల ర్యాంకు రావడం గమనార్హం. అంతేకాదు గతేడాది 720కి 720 మార్కులు వచ్చినవారు దేశవ్యాప్తంగా ఇద్దరు మాత్రమే ఉండగా, ఈసారి 67 మంది ఉన్నారు. 

☛ NEET Ranker Success Storty : 8 ఏళ్లకే పెళ్లి.. ఈ క‌సితోనే చ‌దివి.. నీట్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టి.. డాక్ట‌ర్ అయ్యానిలా..

ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం.. 
ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)... తదుపరి రాష్ట్రాల వారీగా అభ్యర్థుల జాబితాను తయారు చేస్తుంది. అనంతరం ఆ డేటాను రాష్ట్రాలకు పంపిస్తుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు తమ రాష్ట్రానికి దరఖాస్తు చేసినప్పుడు, వారు రాష్ట్ర కేటగిరీ జాబితా ప్రకారం విభజిస్తారు. రాష్ట్ర కౌన్సెలింగ్‌ అధికారులు తదనుగుణంగా వారి మెరిట్‌ జాబితాను తయారు చేస్తారు. 15 శాతం ఆలిండియా కోటా సీట్లను డీమ్డ్‌ వర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూలోని ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

➤☛ NEET 2023 Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

కౌన్సెలింగ్‌ వివరాలు, షెడ్యూల్‌ను..
అభ్యర్థులు 15 శాతం ఆలిండియాకోటా సీట్లకు దరఖాస్తు చేస్తారు. సీట్లు అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్‌ నిలిపివేస్తారు. కౌన్సెలింగ్‌ వివరాలు, షెడ్యూల్‌ను ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆలిండియా ర్యాంక్‌ ఆధారంగా సంబంధిత కౌన్సెలింగ్‌ అధికారులతో మెరిట్‌ జాబితా తయారు చేస్తారు. 

NEET Seats 2023 : నీట్‌లో జీరో మార్కులు వ‌చ్చిన కూడా సీటు.. ఎలా అంటే.. ఇలా..?

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ కూడా సంబంధిత స్టేట్‌ కౌన్సెలింగ్‌ అథారిటీనే నిర్వహిస్తుంది. నీట్‌ ఫలితాల డేటాను బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు కూడా వినియోగించుకోవచ్చు. గుర్తింపు పొందిన వెటర్నరీ కళాశాలల్లో 15 శాతం కోటా కింద బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సుల అడ్మిషన్లకూ ఈ ఫలితాల డేటాను ఉపయోగించుకోవచ్చు.  

జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఈ కటాఫ్ మార్కులు ఇలా..
☛ UR/ EWS : 720 – 164
☛ OBC :     163 – 129
☛ SC :      163 – 129
☛ ST :      163 – 129
☛ PH UR/EWS : 163 – 146
☛ PH OBC :  145 – 129
☛ PH SC :   145 – 129
☛ PH ST :   145 – 129

Published date : 05 Jun 2024 03:45PM

Photo Stories