Skip to main content

NEET 2023 Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

ప‌ట్టుద‌ల ఉండాలే కానీ.. చ‌దువుకు పేద‌రికం అడ్డ‌రాద‌ని.. నిరూపించింది మిస్బాహ్‌. ఈమె తండ్రి పంక్చర్‌ దుకాణం నడుపుతున్నాడు.
NEET Ranker Misbah Succcess Story
NEET 2023 Ranker Misbah

నిరుపేద కుటుంబం. కుటుంబ షోషన‌కే ఈయ‌న ఆదాయం స‌రిపోయేది కాదు. ఎంతో క‌ష్టం మీద ఒక వైపు కుటుంబ పోషణ.. మ‌రో వైపు పిల్ల‌ల చ‌దువును నెట్టుకోచ్చేవారు.

ఈ విషయం తెలియగానే..
మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో పంక్చర్‌ దుకాణం నడుపుతున్న అన్వర్‌ ఖాన్‌ కుమార్తె మిస్బాహ్ నీట్ యూజీ (NEET UG) పరీక్ష క్రాక్‌ చేసి కుటుంబంలో అవధులు లేని ఆనందాన్ని నింపింది. మిస్బాహ్‌ నీట్‌ పరీక్షలో 720 మార్కులకు 633 స్కోర్‌తో విజయం సాధించింది. ఈ విషయం తెలియగానే జాల్నా పట్టణంలోని వారంతా ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

➤☛ NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే.. ఈ సారి మాత్రం..

ఎడ్యుకేష‌న్ సాగిందిలా..
స్కూలు రోజుల నుంచే మిస్బాహ్‌ చదువులో ఎంతో చురుకు. 10 వ తరగతిలో 92 శాతం మార్కులు తెచ్చుకుంది. 12 వ తరగతి బోర్డు పరీక్షలో 86 శాతం మార్కులు దక్కించుకుంది. 

ఈ కలను సాకారం చేసుకోవ‌డం కోసం..
మిస్బాహ్‌ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తండ్రి అన్వర్‌ ఖాన్‌ మోటార్‌సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి పరిస్థితులు బాగోలేకపోయినా తనకుమార్తె ఎంతో శ్రమించి, రెండవ ప్రయత్నంలోనే నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. ఇప్పుడు తన కుమార్తె ఎంబీబీఎస్‌ చేయాలనే కలను సాకారం చేసుకుంటున్నదన్నారు.

➤☛ NEET(UG)-2022 Andhra Pradesh State Quota MBBS Cutoff Ranks

ఈయ‌న లేకుంటే..
నీట్‌ పరీక్షలో తమ కుమార్తె విజయం సాధించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భంగా తండ్రి అన్వర్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘ఒకవేళ అంకుశ్‌ సార్‌ మార్గదర్శకత్వం లేకుంటే మిస్బాహ్‌ ఈ విజయాన్ని సాధించలేకపోయేది. గడచిన రెండు మూడేళ్లుగా తన కుమార్తె పట్టణంలోని అంకుశ్‌ సార్‌ దగ్గర ఉచితంగా నీట్‌ క్లాసులకు హాజరవుతోంది. దీనికితోడు ఎంతో కష్టపడి చదవడంతో తన కుమార్తె పట్టణం నుంచి నీట్‌ పరీక్షలో టాపర్‌గా నిలిచిందని’ అన్నారు.

చ‌ద‌వండి: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

పేద విద్యార్థులకు ఉచితంగానే..
జాల్నాలో నీట్‌ పరీక్షకు శిక్షణ అందిస్తున్న అంకుశ్‌ మాట్లాడుతూ.. మేము విద్యార్థులు కోసం ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ అందిస్తున్నాం. దీనిలో మిస్బాహ్‌ ఉచిత కోచింగ్‌ తీసుకుంది. ఇప్పుడు మా కృషికి తగిన ఫలితం దక్కినట్లు అనిపించింది అని అన్నారు. 

➤☛ NEET UG Exam 2023 Question Paper & Key : నీట్ ప్ర‌శ్నాప‌త్రం ఇదే... ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

మా ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయ్‌.. 

Misbah Khan Neet ranker success story in telugu

మిస్బాహ్‌ మాట్లాడుతూ.. ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అయినా పగలనక, రాత్రనక కష్టపడి చదివాను. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా పేదలకు వైద్య సేవలు అందిస్తాను అని తెలిపింది. అలాగే నాలాంటి విద్యార్థుల చ‌దువుకు సాయం చేస్తాన‌న్నారు.

➤☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

Published date : 16 Jun 2023 04:08PM

Photo Stories