NEET UG Exam 2023 Question Paper & Key : నీట్ ప్రశ్నాపత్రం ఇదే... ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే
13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే...
ఎంబీబీస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌లో మంచి మార్కులు సాధించిన వారికే సీట్లు దక్కుతాయి. పరీక్షలో సత్తా చాటేందుకు విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడతారు. అయితే ఈ సారి ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే కొంచెం ఈజీగా వచ్చిందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతేడాది నీట్ పరీక్షతో పోల్చి చూస్తే మాత్రం కఠినంగా ఉందని తెలిపారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. నీట్ కట్ ఆఫ్ మార్కులు, ర్యాంకులను త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించే అవకాశం ఉంది. మరో కొద్ది రోజుల్లో తుది ఫలితాలపై స్పష్టత రానుంది.