NEET UG Counselling 2025 Restarts: నీట్ యూజీ కౌన్సెలింగ్ తిరిగి ప్రారంభం.. షెడ్యూల్ విడుదల

దీని ప్రకారం రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్, సీట్ల కేటాయింపు,కౌన్సెలింగ్ తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు mcc.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
కాగా నీట్ తొలి రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొన్ని రోజులకే నిన్న షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు MCC అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఎలాంటి కారణం వెల్లడించకుండానే ఈ ప్రకటన రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కౌన్సెలింగ్ సవరించిన షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది.
NEET UG 2025 సవరించిన షెడ్యూల్ :
కౌన్సెలింగ్ | తేదీ/సమయం |
---|---|
రౌండ్-1 రిజిస్ట్రేషన్ | ఆగస్టు 6, మధ్యాహ్నం 3:00 గంటల వరకు |
రిజిస్ట్రేషన్ రీసెట్ | ఆగస్టు 6, మధ్యాహ్నం 12:00 వరకు |
ఫీజు చెల్లింపు | ఆగస్టు 6, సాయంత్రం 6:00 వరకు |
చాయిస్ ఫిల్లింగ్ | ఆగస్టు 7, ఉదయం 8:00 గంటల వరకు |
చాయిస్ లాకింగ్ | ఆగస్టు 6 రాత్రి 8:00 నుంచి – ఆగస్టు 7 ఉదయం 8:00 వరకు |
సీట్ల కేటాయింపు ప్రక్రియ | ఆగస్టు 7 – ఆగస్టు 8 మధ్య జరుగుతుంది |
ఫలితాల ప్రకటన | ఆగస్టు 9, 2025 |
కాలేజీలకు రిపోర్టింగ్ | ఆగస్టు 9 – ఆగస్టు 18 వరకు |
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 7 ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది, అలాగే చాయిస్ లాకింగ్ ఆగస్టు 6 రాత్రి 8 గంటల నుండి ఆగస్టు 7 ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది. సీట్ల కేటాయింపు ఆగస్టు 7 నుండి 8 మధ్య జరుగుతుంది. ఫలితాలు ఆగస్టు 9న విడుదల అవుతాయి. అభ్యర్థులు ఆగస్టు 9 నుండి 18 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు సూచనలు:
- రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తికాకపోతే వెంటనే పూర్తి చేయండి
- ఎంపికలు జాగ్రత్తగా ఎంచుకొని తప్పనిసరిగా లాక్ చేయాలి.
- ఫలితాలు వెల్లడయ్యాక సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి, లేదంటే సీటు రద్దవుతుంది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- NEET UG 2025
- NEET counselling resumed
- NEET Round 1 revised schedule
- Counselling Update
- NEET 2025 choice filling
- NEET Seat Allotment
- mcc.nic.in
- NEET seat allotment 2025
- NEET UG latest news
- Medical Counselling
- NEET revised counselling dates
- NEET registration update
- MCC official website
- MedicalAdmissions2025
- NEETUGUpdates
- MedicalCounsellingCommittee
- NEETRegistration
- NEETUG2025
- NEETCounselling