Skip to main content

MBBS internship: ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... ప‌రీక్ష పేప‌ర్ల‌లోనూ అమ‌లు

ఎంబీబీఎస్‌ విద్యలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీలు, ఇంటర్న్‌షిప్‌, ఇతర అంశాల్లో జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) మార్పులు తెచ్చింది. ఫ‌స్ట్ ఇయ‌ర్‌ చదివిన అనంతరం విద్యార్థులు మరో కళాశాలకు బదిలీ కావడాన్ని నిలిపివేసింది.
MBBS internship
MBBS internship

కౌన్సెలింగ్‌ ద్వారా తొలుత సీటు వచ్చిన కళాశాలల్లో చేరి, రెండో ఏడాదిలో పలువురు విద్యార్థులు మరోచోట చేరుతున్నారు. ఈ ఏడాది నుంచి ఇలా మార‌డం కుద‌ర‌దు.

NEET merit list: నీట్‌లో ఇక‌పై ఫిజిక్స్ మార్కుల ఆధారంగా ర్యాంకుల ప్ర‌క‌ట‌న‌... ఎప్ప‌టినుంచంటే....!

ఎంబీబీఎస్‌ చదివిన వారు ఇకపై పదేళ్ల కాల పరిమితిలో కాకుండా రెండేళ్లలోనే ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ పూర్తి చేసినప్పటికీ ఇంటర్న్‌షిప్‌ను 12 నెలల్లో చేయకుండా కొంతకాలం చేసి, ఉన్నత విద్యకు వెళ్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారు ఇలా చేస్తున్నారు. తరువాత తమకు ఇష్టమొచ్చిన సమయంలో పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం రెండేళ్లలోనే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాలని ఎన్‌ఎంసీ నిర్దేశించింది.

NEET

ఇంట‌ర్న్‌షిప్ కూడా ఏ కళాశాలలో చేరితే.. అక్కడే చేయాల్సి ఉంటుంది. కొంతమంది చదివిన కళాశాలలో కాకుండా.. ప్రత్యేక అనుమతులతో వేరే ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. దీనికి కూడా జాతీయ వైద్య కమిషన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అలాగే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ పరీక్ష పేపర్ల విషయంలోనూ ఎన్‌ఎంసీ మార్పులు తెచ్చింది.

MBBS Seats: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

NEET

ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు తప్పకుండా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్ట్స్‌) రాయాల్సి ఉంటుంది. 2019లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి ఈ సంవత్సరం కూడా ప్రస్తుత విధానంలోనే పరీక్షలు జరుగుతున్నాయి. తరువాత సంవత్సరాల్లో చేరిన వారికి ఎప్పటి నుంచి నెక్ట్స్‌ విధానం అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత రాలేదు. 

NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే

ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు ఆరోగ్య విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా తుది ఏడాదిలో నెక్ట్స్‌ కింద స్టెప్‌-1, 2 అనే రెండు రకాల పరీక్షలు రాయాలి. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, వైద్యులుగా ప్రాక్టీసుకు అర్హత లభిస్తుంది.

NEET

NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్‌.. కీ కోసం క్లిక్ చేయండి

ఈ విద్యా సంవత్సరానికి మాత్రం యథావిధిగా ప్రస్తుత విధానంలో ఆరోగ్య విశ్వవిద్యాలయాల ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. నీట్‌ యూజీ ఫలితాలకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితాలు త్వరలో కేంద్రం నుంచి రానున్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Published date : 20 Jun 2023 01:49PM

Photo Stories